వింతైన వ్యాధి బారిన పడిన యువకుడు.. పింగ్ పాంగ్ బంతుల్లా ఉండే వేళ్ళని వరంగా మార్చుకున్నాడుగా
యోషిదా ఒక జన్యుపరమైన పరిస్థితితో బాధపడుతున్నాడు. దీని వలన అతని వేళ్ల కొసలు పింగ్-పాంగ్ బంతుల వలె ఉబ్బుతాయి. అయితే.. అతని ఈ శారీరక లోపం ఇప్పుడు అతనికి వరంగా మారింది. సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యాడు. సోషల్ మీడియాలో ఆ యువకుడిని బాచి యుబి-సాన్ (మిస్టర్ డ్రమ్ స్టిక్ ఫింగర్స్) అని పిలుస్తారు. ఆడిటీ సెంట్రల్ అనే వెబ్‌సైట్ నివేదిక ప్రకారం 2022 చివరలో యోషిదా జపాన్‌లో తన వికృతమైన వేళ్ల చిత్రాలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రజల దృష్టిని ఆకర్షించడం ప్రారంభించాడు. అయితే ప్రజల స్పందన ఎప్పుడూ సానుకూలంగా లేదా ఒకేలా ఉండదు.
ప్రపంచంలో చాలా మంది విచిత్రమైన వ్యాధులతో బాధపడుతున్నారు. కొందరి వింత వ్యాధుల గురించి తెలిస్తే ఆశ్చర్య పడతాం.. అదే సమయంలో కొందరి వ్యాధుల గురించి వింటే అంటే నిద్రలో షాపింగ్ చేసే వ్యాధి వంటివి వింటే అసలు ఇలాంటి రోగాలు కూడా ఉంటాయా అని భావిస్తాం అదే సమయంలో కొంతమందికి వచ్చిన వ్యాధితో వింతగా కనిపించడమే కాదు.. ప్రతిరోజూ భయంకరమైన నొప్పిని కూడా అనుభవిస్తారు. ప్రస్తుతం ఓ యువకుడు వింత వ్యాధితో బాధపడుతున్నాడు. జపాన్‌కు చెందిన ఒక యువకుడి వేళ్లు పింగ్-పాంగ్ బాల్స్‌లా ఉబ్బిపోయే వింత వ్యాధితో బాధపడుతూ వార్తల్లో నిలిచాడు. నగోయాకు చెందిన ఈ యువకుడి పేరు షోగో యోషిదా. హెయిర్ డ్రస్సర్‌గా పనిచేస్తున్నాడు.
వాస్తవానికి యోషిదా ఒక జన్యుపరమైన పరిస్థితితో బాధపడుతున్నాడు. దీని వలన అతని వేళ్ల కొసలు పింగ్-పాంగ్ బంతుల వలె ఉబ్బుతాయి. అయితే.. అతని ఈ శారీరక లోపం ఇప్పుడు అతనికి వరంగా మారింది. సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యాడు. సోషల్ మీడియాలో ఆ యువకుడిని బాచి యుబి-సాన్ (మిస్టర్ డ్రమ్ స్టిక్ ఫింగర్స్) అని పిలుస్తారు.
అతని వ్యాధిపై భిన్నాభిప్రాయాలు
ఆడిటీ సెంట్రల్ అనే వెబ్‌సైట్ నివేదిక ప్రకారం 2022 చివరలో యోషిదా జపాన్‌లో తన వికృతమైన వేళ్ల చిత్రాలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రజల దృష్టిని ఆకర్షించడం ప్రారంభించాడు. అయితే ప్రజల స్పందన ఎప్పుడూ సానుకూలంగా లేదా ఒకేలా ఉండదు. కొంతమంది అతని చేతులు చాలా అసహ్యకరంగా ఉన్నాయని కామెంట్ చేయగా.. మరికొందరు చాలా ‘వింతగా ఉన్నాయని పిలిచారు. అదే సమయంలో వైకల్యం నుంచి డబ్బు సంపాదించడానికి ప్రయత్నించినందుకు అతన్ని తిట్టారు. అయితే ఎవరు ఏమన్నా.. యోషిదా పట్టించుకోలేదు. తన చేతి వేళ్ళను చూస్తూ జనం చేసిన విమర్శలను తట్టుకున్నాడు.
ఏ వ్యాధితో బాధపడుతున్నాడంటే
వేళ్లు చివర చిన్న బంతుల్లో ఉబ్బిపోయేలా చేసే అరుదైన జన్యుపరమైన వ్యాధి అయిన పాచైడెర్మోపెరియోస్టోసిస్ (PDP)తో యోషిదా బాధపడుతున్నాడు. చిన్నతనం నుంచి స్నేహితులు చేసే ఎగతాళికి గురయ్యాడు. అసహ్యకరమైన రూపంతో ఇబ్బంది పడినట్లు చెప్పాడు. అయితే యోషిదా పెరిగేకొద్దీ.. అతని ఆలోచన దృక్పథంలో మార్పు వచ్చింది. తన అనారోగ్యాన్ని సానుకూల పద్ధతిలో చూడడం మొదలు పెట్టాడు. ఈ వేళ్లు తన శరీరంలో ఒక భాగమని.. తాను జీవితాంతం వీటితోనే జీవించాల్సిందే అని యోషిదా అంగీకరించాడు.
సోషల్ మీడియాలో ఫోటోలు షేర్
నివేదికల ప్రకారం యోషిదా తన శారీరక విచిత్రం తనను ఇతరుల కంటే భిన్నంగా కనిపించేలా చేసిందని గ్రహించాడు. తన ప్రత్యేకమైన వేళ్ల చిత్రాలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ప్రారంభించాడు. ఇప్పుడు అతను నగరం అంతటా ప్రసిద్ధి చెందిన యువకుడిగా మారాడు. తన ప్రత్యేకమైన వేళ్ల కారణంగా సోషల్ మీడియాలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు నాగోయాలో అత్యంత డిమాండ్ ఉన్న హెయిర్ స్టైలిస్ట్‌లలో ఒకడుగా నిలిచాడు. ఆ బంతి ఆకారపు వేళ్లతో తలకు మసాజ్ చేయించుకోవడానికి ప్రజలు క్యూలో నిలిచి ఉంటారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..