AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uri Encounter: ఉరీలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు, ఇద్దరు ఉగ్రవాదులు హతం

LOC సమీపంలో భద్రతా దళాల బృందం ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చింది. భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఉగ్రవాదులు గోహ్లాన్ ప్రాంతం నుంచి చొరబడేందుకు యత్నిస్తుండగా హతమయ్యారు. భద్రతా బలగాలు ఉరీ మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఓ వైపు ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. మరోవైపు ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతోంది. ఉగ్రవాదులు ఉన్నట్టు సమాచారం అందడంతో భద్రతా బలగాలు సకాలంలో అక్కడికి చేరుకుని సరిహద్దులు దాటడానికి ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులను హతమార్చాయి.

Uri Encounter: ఉరీలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు, ఇద్దరు ఉగ్రవాదులు హతం
Uri Bsf Encounter
Surya Kala
|

Updated on: Jun 22, 2024 | 6:03 PM

Share

కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా ఉరీలో ఉగ్రవాదులు మరోసారి చొరబాటుకు యత్నించారు. అయితే వెంటనే స్పందించిన భారత ఆర్మీ, బీఎస్ఎఫ్ జవాన్లు ఈ ఉగ్ర చొరబాట్లను భగ్నం చేశారు. LOC సమీపంలో భద్రతా దళాల బృందం ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చింది. భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఉగ్రవాదులు గోహ్లాన్ ప్రాంతం నుంచి చొరబడేందుకు యత్నిస్తుండగా హతమయ్యారు.

భద్రతా బలగాలు ఉరీ మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఓ వైపు ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. మరోవైపు ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతోంది. ఉగ్రవాదులు ఉన్నట్టు సమాచారం అందడంతో భద్రతా బలగాలు సకాలంలో అక్కడికి చేరుకుని సరిహద్దులు దాటడానికి ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులను హతమార్చాయి. ఉగ్రవాదులు చొరబాటుకు యత్నిస్తున్నట్లు సమాచారం.

బారాముల్లాలో ఇద్దరు ఉగ్రవాదులు హతం

బుధవారం (జూన్ 19) నార్త్ కాశ్మీర్‌లోని బారాముల్లాలో భారత ఆర్మీ సంయుక్త బృందం ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చింది. దీంతో పాటు దాడికి పాల్పడిన నిందితుడిని కూడా అరెస్టు చేశారు. రియాసి దాడి కేసులో ఇదే మొదటి అరెస్టు. హడిపోరా ప్రాంతంలో హతమైన ఇద్దరు ఉగ్రవాదులను ఇంకా గుర్తించలేదని ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న ఒక అధికారి తెలిపారు.

ఇవి కూడా చదవండి

రియాసి దాడిలో హక్ముద్దీన్ అనే వ్యక్తి అరెస్ట్

రియాసి దాడిలో హక్ముద్దీన్ అనే వ్యక్తిని జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. హక్ముద్దీన్ తన ఇంట్లో హతమైన ఇద్దరు ఉగ్రవాదులకు ఆశ్రయం, ఆహారం ఇచ్చిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ఉగ్రవాదులు బస్సుపై దాడి చేసిన ప్రదేశానికి ఆ వ్యక్తులను తీసుకెళ్లారు.

అంతేకాదు జూన్ 17వ తేదీన జమ్మూ కశ్మీర్‌లోని బందిపొరాలో భద్రతా దళాలు మరో భారీ విజయాన్ని సాధించాయి. బండిపొరాలోని అరమ్ ప్రాంతంలో భద్రతా బలగాలు ఓ ఉగ్రవాదిని హతమార్చాయి. ఆర్మీ, సీఆర్పీఎఫ్, జమ్మూకశ్మీర్ పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి ఈ ఆపరేషన్ చేపట్టారు. ఇన్‌పుట్ ఆధారంగా భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఇన్‌పుట్‌లలో, ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సూచనలు ఉన్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సంప్రదాయ బద్ధంగా అల్లు శిరీష్ హల్దీ వేడుక.. వీడియో ఇదిగో
సంప్రదాయ బద్ధంగా అల్లు శిరీష్ హల్దీ వేడుక.. వీడియో ఇదిగో
బ్యాంకింగ్ రూల్స్‌లో భారీ మర్పులు.. ఆర్బీఐ కీలక డెసిషన్
బ్యాంకింగ్ రూల్స్‌లో భారీ మర్పులు.. ఆర్బీఐ కీలక డెసిషన్
సోంపు ఇలా తిన్నారంటే..ఆ వ్యాధులన్నీ మాయం! ఎన్ని లాభాలో తెలిస్తే.
సోంపు ఇలా తిన్నారంటే..ఆ వ్యాధులన్నీ మాయం! ఎన్ని లాభాలో తెలిస్తే.
ఆది మూవీకి ఎన్టీఆర్ హీరో.! 19 ఏళ్ల తారక్‌కు కథ చెప్పగానే ఆ డౌట్..
ఆది మూవీకి ఎన్టీఆర్ హీరో.! 19 ఏళ్ల తారక్‌కు కథ చెప్పగానే ఆ డౌట్..
రెండుసార్లు విడాకులు.. 45 ఏళ్ల వయసులో గ్లామర్ అరాచకం..
రెండుసార్లు విడాకులు.. 45 ఏళ్ల వయసులో గ్లామర్ అరాచకం..
బీచ్ నుండి ఈ వస్తువులను పొరపాటున కూడా ఇంటికి తీసుకురాకండి..
బీచ్ నుండి ఈ వస్తువులను పొరపాటున కూడా ఇంటికి తీసుకురాకండి..
ఓడలు, విమానాలు లేకుండా ప్రపంచ యాత్ర.. భూగోళంపై మ్యాజిక్
ఓడలు, విమానాలు లేకుండా ప్రపంచ యాత్ర.. భూగోళంపై మ్యాజిక్
మీలో ఈ లక్షణాలు కనిపిస్తే.. బీ కేర్‌ఫుల్.! లివర్ ఇక షెడ్డుకే..
మీలో ఈ లక్షణాలు కనిపిస్తే.. బీ కేర్‌ఫుల్.! లివర్ ఇక షెడ్డుకే..
ముంబై కోస్టల్ రోడ్డుపై సరికొత్త మ్యాజిక్.. ఆ స్పీడ్‌తో వెళ్తేనే..
ముంబై కోస్టల్ రోడ్డుపై సరికొత్త మ్యాజిక్.. ఆ స్పీడ్‌తో వెళ్తేనే..
ఏపీ బడ్జెట్‌లో పథకాలకు ప్రత్యేక నిధులు.. వీటికి లైన్ క్లియర్
ఏపీ బడ్జెట్‌లో పథకాలకు ప్రత్యేక నిధులు.. వీటికి లైన్ క్లియర్