AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyper Aadi: హైపర్ ఆదికి కోపం వచ్చింది.. స్టేజ్ దిగి వచ్చి మరీ సీరియస్ వార్నింగ్.. వీడియో వైరల్

జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన వారిలో హైపర్ ఆది ఒకడు. తన కామెడీతో ప్రేక్షుకులను విశేషంగా ఆకట్టుకున్నాడు హైపర్ ఆది. ఎన్నో వదల స్కిట్స్ లో నవ్వులు పూయించాడు హైపర్ ఆది. అలాగే సినిమాల్లోనూ ఛాన్స్ లు అందుకున్నాడు. ఇప్పుడు టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ రాణిస్తున్నాడు.

Hyper Aadi: హైపర్ ఆదికి కోపం వచ్చింది.. స్టేజ్ దిగి వచ్చి మరీ సీరియస్ వార్నింగ్.. వీడియో వైరల్
Hyper Aadi
Rajeev Rayala
|

Updated on: Apr 05, 2026 | 7:46 AM

Share

హైపర్ ఆది.. జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు ఈ నటుడు. తన పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి మెప్పించాడు. హైపర్ ఆది కోసమే జబర్దస్త్ చూసే ఆడియన్స్ కూడా ఉండేవారు. జబర్దస్త్ తోపాటు ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోల్లోనూ తన కామెడీతో నవ్వులు పూయించాడు ఆది. కేవలం టీవీ షోల్లోనే కాదు సినిమాల్లోనూ నటించి మెప్పించాడు. పలు సూపర్ హిట్ సినిమాల్లో ఆది తన కామెడీతో ఆకట్టుకున్నాడు. అటు సినిమాలు. ఇటు టీవీ షోలతో దూసుకుపోతున్న ఆది.. బయట ఈవెంట్స్ కు కూడా వెళ్తుంటాడు. బయట ఈవెంట్స్ లోనూ పాల్గొని ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటాడు ఆది.

ఇదిలా ఉంటే తాజాగా ఆదికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో హైపర్ ఆది ఓ వ్యక్తితో గొడవపెట్టుకుంటూ కనిపించాడు. స్టేజ్ దిగి వచ్చి మరీ అతనితో వాగ్వాదానికి దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియో పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. స్టేజ్ దిగి వచ్చి మరీ ఆది ఆతనికి వార్నింగ్ ఇస్తున్నదంటే అక్కడ ఎదో పెద్ద గొడవే జరిగి ఉంటుందని అంటున్నారు.

మాములుగా హైపర్ ఆది చాలా సహనంతో ఉంటాడు. వివాదాల జోలికి పెద్దగా వెళ్ళాడు. అలాంటి ఆది సీరియస్ అయ్యి వార్నింగ్ ఇచ్చే వరకు వెళ్లిందంటే అక్కడ ఉన్న వ్యక్తి ఆదిని రెచ్చగొట్టి ఉంటాడు అని నెటిజన్స్. ఆది వార్నింగ్ ఇస్తుంటే చాలా మంది అతని చుట్టూ ఉన్నవారు చూస్తూ ఉన్నారు. పక్కనే పోలీసుకు కూడా కనిపిస్తున్నారు. దాంతో అసలు ఏం జరిగింది.? ఆదికి అంత కోపం ఎందుకు వచ్చింది అంటూ నెటిజన్స్ ఆరా తీస్తున్నారు.  అయితే ఈ వీడియో కొత్తదా.? లేక ఎప్పుడో జరిగిందా.. అన్నది తెలియాల్సి ఉంది.

వీడియో చూడండి.. 

Follow Us