AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భార్యాభర్తల బంధం బలపడాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి..!

భార్య భర్తల బంధం ప్రేమ, గౌరవం, విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని మాటలు, పనులు అనుకోకుండా సంబంధాన్ని దెబ్బతీయవచ్చు. ప్రత్యేకించి భర్తలు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న శ్రద్ధతో పరస్పరం గౌరవం పెరిగి బంధం మరింత బలపడుతుంది.

భార్యాభర్తల బంధం బలపడాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి..!
Couple
Prashanthi V
|

Updated on: Jun 29, 2025 | 7:28 PM

Share

పెళ్లి అనేది ఒక పవిత్రమైన బంధం. ఈ బంధాన్ని సున్నితంగా ప్రేమతో ఒకరికొకరు గౌరవించుకుంటూ కొనసాగించాలి. ఒకరి మనసుకు నొప్పి కలిగించే మాటలు లేదా పనులు ఈ బంధాన్ని చెడగొట్టే ప్రమాదం కలిగి ఉంటాయి. భార్యభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు ఉండటం సహజం. కానీ అలాంటి సమయంలో కోపంగా మాట్లాడుతూ.. నీ పని చూసుకో, నువ్వు నిశ్శబ్దంగా ఉండు వంటి అవమానకర పదాలు భార్యకు అనకండి. ఆమె మనసులో నొప్పిని కలిగించి, సంబంధాన్ని దెబ్బతీస్తాయి.

ఇంట్లో ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భాల్లో భార్యతో ముందుగా చర్చించడం చాలా ముఖ్యం. నాకు చెప్పకుండానే ప్లాన్ చేసేశాడు అనిపించేలా చేస్తే.. ఆమెను పట్టించుకోవడం లేదని భావించే అవకాశం ఉంటుంది.

చిన్న విషయాలకే విడాకుల గురించి మాట్లాడటం చాలా ప్రమాదకరం. అలా మాట్లాడడం వల్ల అవతలి వారికి తీవ్రంగా మనస్తాపం కలుగుతుంది. ప్రశాంతంగా ఉండి కాస్త సమయం తీసుకుని మీ భావాలను స్పష్టంగా చెప్పడం మంచిది. ఎప్పటికైనా ప్రేమతో చెప్పిన మాటలు అర్థం చేసుకునేలా చేస్తాయి.

మీ భార్యను వేరే ఎవరితోనైనా పోల్చడం ఆమెను చిన్నచూపు చూస్తున్నట్లు భావించడానికి దారితీస్తుంది. మీ భార్య చేసే పని తప్పు అనిపిస్తే వ్యక్తిగతంగా సున్నితంగా చెప్పండి. మిగతా వాళ్ల ముందు వ్యాఖ్యలు చేయడం అస్సలు మంచిది కాదు.

భర్తతో వచ్చిన గొడవను బహిరంగంగా లేదా స్నేహితులతో పంచుకోవడం వల్ల సమస్యలు తగ్గడం కంటే పెరిగే అవకాశమే ఎక్కువ. ప్రతి సమస్యను ఇంటి నాలుగు గోడల మధ్యే పరిష్కరించాలి. వేరే వారికి చెప్పడం వల్ల అపోహలు, నమ్మకాలు దెబ్బతినే ప్రమాదం ఉంది.

మీ భార్య చేసే ప్రతి పనిలో ఆమెను నిందించకుండా.. మంచి మాటలతో అర్థం చేసుకుని మార్పు తేవాలని ప్రయత్నించండి. ఈ విధంగా గౌరవంగా వ్యవహరించడం వల్ల బంధం మరింత బలపడుతుంది. ఈ చిన్న చిన్న విషయాలను ప్రతి దంపతులు గమనిస్తే.. వారి మధ్య పరస్పర విశ్వాసం పెరుగుతుంది.