Honey side effects: తేనెను ఇలా తిన్నారంటో ఆరోగ్యానికి మరింత ప్రమాదం..
పురాతన కాలం నుండి భారతీయ ఆయుర్వేదంలో తేనెకు ప్రత్యేక స్థానం ఉంది. వేల సంవత్సరాల క్రితం సీసాల్లో స్వచ్ఛమైన తేనె దొరికేది కాదు. అప్పట్లో ఋషులు పువ్వుల నుంచి నేరుగా తేనెను సేకరించి తేనెతో మందులు తయారుచేసుకుని, తమ ఆరోగ్యాన్ని..
honey side effects in telugu: పురాతన కాలం నుండి భారతీయ ఆయుర్వేదంలో తేనెకు ప్రత్యేక స్థానం ఉంది. వేల సంవత్సరాల క్రితం సీసాల్లో స్వచ్ఛమైన తేనె దొరికేది కాదు. అప్పట్లో ఋషులు పువ్వుల నుంచి నేరుగా తేనెను సేకరించి తేనెతో మందులు తయారుచేసుకుని, తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేవారు. ఔషధ గుణాలు పుష్కలంగా నిండిన తేనెను ఆయుర్వేదంలో ‘ఆరోగ్య నిధి’ అని అంటారు అంటారు.
తేనెతో ఆరోగ్య ప్రయోజనాలు
- సహజ చక్కెరగా పేరుగాంచిన తేనెలో పోషకాలు, యాంటీ బాక్టీరియల్స్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇది అనేక రకాల ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.
- గ్యాస్ట్రోఇంటెస్టినల్ సమస్యల నుండి బయటపడటానికి తేనె సహాయపడుతుంది.
- ఎలాంటి గాయమైనా నయం చేయడంలో తేనె ఎంతో ఉపయోగపడుతుంది.
- గుండె ఆరోగ్యంగా ఉండేందుకు తేనె కూడా సహకరిస్తుంది.
- తేనెలో ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, కాల్షియం, నియాసిన్, పొటాషియం, జింక్, అమైనో ఆమ్లాలు, ఎంజైములు, అనేక ఇతర సమ్మేళనాలు ఉన్నాయి. ఇది నేరుగా శరీరానికి ఉపయోగపడతాయి.
చాలా మంది ఉదయాన్నే గ్లాసుడు గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ రసం, తేనె కలుపుకుని తాగుతుంటారు. ఇలా చేస్తే శరీరంలో కొవ్వు పేరుకుపోదని అనేక మంది దీనిని సేవిస్తారు. తేనె మన శరీరంలోని హానికరమైన టాక్సిన్లను తొలగించే గుణం కలిగి ఉందనే విషయం వాస్తవం అయినప్పటికీ ఆయుర్వేద నిపుణులు అభిప్రాయం ప్రకారం.. తేనె నియమానుసారంగా తేనె తింటే శరీరానికి మేలు జరుగుతుందని చెబుతున్నారు. తేనేను మితంగా తీసుకుంటేనే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మోతాదుకు మించితే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్యా నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. అవేంటంటే..
తేనెను ఇలా అస్సలు తినకూడదు.. టీ, వేడి పాలు, వేడి నీళ్లు వంటి పానియాల్లో తేనెను అస్సలు కలపకూడదు. మరిగే టీ లేదా నీళ్లలో తేనెను కలపకూడదు. అలాగే వంటల్లో కూడా తేనెను కలపకూడదని ఆయుర్వేదం చెబుతోంది. ఇలా చేస్తే తేనె నాణ్యత కోల్పోతుందట. నిర్దిష్ట ఉష్ణోగ్రతల వద్ద మాత్రమే వంటల్లో తేనెను ఉపయోగించాలి. లేకపోతే అది విషంగా మారవచ్చిన చెబుతున్నారు.
వేడి నీటిలో తేనె ఎందుకు కలపకూడదు..? వేడి నీళ్లలో తేనె కలిపితే అది విషంలా మారుతుందని ఆయుర్వేదం చెబుతోంది. ఇలా తేనెను తీసుకుంటే శరీరంలో విషపూరితమైన టాక్సిన్లు పేరుకుపోతాయి. ఈ టాక్సిన్లు రక్తంలో కలిసిపోయి, అవసరమైన పోషకాలు రక్తంలో కలవకుండా అడ్డుకుంటాయి. ఫలితంగా శరీరంలో పోషకాల లోపం తలెత్తుతుంది.