Heat Stroke: జేబులో పచ్చి ఉల్లిపాయ పెట్టుకుంటే వడదెబ్బ తగలదా..? అసలు నిజం ఏంటో తెలుసుకోండి..
భానుడి భగభగలు మండిస్తుండడంతో హీట్ స్ట్రోక్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపధ్యంలో పుదీనా, పుల్లటి పెరుగు, పచ్చి ఉల్లిపాయ వంటి ఆహారాలు శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. ముఖ్యంగా ఉల్లిపాయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే ఈ పచ్చి ఉల్లిపాయను జేబులో పెట్టుకుని ఎండలోకి వెళితే హీట్ స్ట్రోక్ ప్రమాదాన్ని నివారించవచ్చా? తెలుసుకుందాం. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయడనేది సామెత. ఉల్లిపాయ రసం శరీర ఉష్ణోగ్రతను సాధారణంగా ఉంచడానికి సహాయపడుతుంది. కనుక వేసవిలో ఉల్లిపాయలు తింటే శరీరం చల్లగా ఉంటుంది.

దేశ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఎండ వేడిమికి అల్లాడిపోతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పాటు, వడ గాలులు వీస్తాయని హెచ్చరిక కూడా ఉంది. ఎండ వేడిమికి శరీరం డీ హైడ్రేషన్ బారిన పడుతోంది. ఇలాంటి వాతావరణంలో అనారోగ్యానికి గురికావడం సహజమే. అంతే కాకుండా భానుడి భగభగలు మండిస్తుండడంతో హీట్ స్ట్రోక్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపధ్యంలో పుదీనా, పుల్లటి పెరుగు, పచ్చి ఉల్లిపాయ వంటి ఆహారాలు శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. ముఖ్యంగా ఉల్లిపాయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే ఈ పచ్చి ఉల్లిపాయను జేబులో పెట్టుకుని ఎండలోకి వెళితే హీట్ స్ట్రోక్ ప్రమాదాన్ని నివారించవచ్చా? తెలుసుకుందాం.
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయడనేది సామెత. ఉల్లిపాయ రసం శరీర ఉష్ణోగ్రతను సాధారణంగా ఉంచడానికి సహాయపడుతుంది. కనుక వేసవిలో ఉల్లిపాయలు తింటే శరీరం చల్లగా ఉంటుంది. అయితే వడదెబ్బ తగలకుండా ఉండేందుకు జేబులో ఉల్లిపాయలు పెట్టుకుని బయటకు వెళ్తే సురక్షితంగా ఉండగలరా? హీట్ స్ట్రోక్ నుంచి పచ్చి ఉల్లి పాయ ఉపశమనం ఇస్తుందా అంటే ఉల్లిపాయలు జేబులో పెట్టుకుని బయటకు వెళితే హీట్ స్ట్రోక్ నివారించబడదు.. అయితే ఎండ వేడికి ఇబ్బందిగా, అసౌకర్యంగా ఫీల్ అయితే ఉల్లిపాయను తినే అవకాశం ఉంది. ఇది అనారోగ్యానికి గురయ్యే ప్రమాదాన్ని నివారించవచ్చు.
ఉల్లిపాయల్లో సోడియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఈ రెండు మినరల్స్ శరీరంలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ నిర్వహించడానికి సహాయపడతాయి. కాబట్టి పచ్చి ఉల్లిపాయను తినడం వల్ల వడదెబ్బ నుండి కాపాడుకోవచ్చు. అంతేకాదు ఉల్లిపాయ రసం కూడా జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఉల్లిపాయలలో క్వెర్సెటిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది వేడి నుంచి ఉపశమనం కలిగించేలా పనిచేస్తుంది. ఉల్లిపాయ రసం వడదెబ్బ తగల కుండా చేయడమే కాదు వడదెబ్బకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. వేసవిలో ఉల్లిపాయలను పచ్చిగా తినండి లేదా వాటిని వంటలో కలపండి. ఎ విధంగా తినే ఆహారంలో చేర్చుకున్నా ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
హీట్ స్ట్రోక్ నివారించడానికి పాటించాల్సిన చర్యలు ఏమిటంటే
- ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దు
- ఎండలోకి వెళ్లేటప్పుడు ముక్కు, నోటిని కప్పుకోండి. గొడుగు, సన్ గ్లాసెస్, టోపీ, వాటర్ బాటిల్ తీసుకురండి.
- వేడి వలన కలిగే అసౌకర్యాన్ని తగ్గించడానికి ముక్కు, నోటిపై తడి రుమాలతో అద్దండి. వేడిలో చాలా అసౌకర్యంగా ఉంటే మెడ, ముఖంపై చల్లటి నీటిని చల్లుకోండి.
- పుష్కలంగా నీరు త్రాగాలి. నీళ్లతో పాటు ఉప్పు-చక్కెర నీరు, ఓఆర్‌ఎస్ నీరు, చెరకు రసం , తాజా పండ్లరసాలను తీసుకోవాలి.
- వేయించిన ఆహారం, కొవ్వు , కారంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండండి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








