పాక్ ప్రధాని షాబాజ్ ఆశలపై నీరు చల్లిన క్రౌన్ ప్రిన్స్ సల్మాన్ .. కాశ్మీర్‌పై భారత్‌కు సౌదీ పూర్తి మద్దతు
మక్కాలోని అల్-సఫా ప్యాలెస్‌లో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ మధ్య అధికారిక సమావేశం జరిగిన ఒక రోజు తర్వాత విడుదల చేసిన ఒక సంయుక్త ప్రకటనలో ఈ విషయాన్నీ వెల్లడించింది. ఈ ప్రకటన ప్రకారం సౌదీ అరేబియా, పాకిస్తాన్ మధ్య సోదర సంబంధాలను బలోపేతం చేయడం, వివిధ రంగాలలో సహకారాన్ని పెంచుకోవడానికి మార్గాలను కనుగొనడంపై దృష్టి పెట్టింది. కశ్మీర్ సహా ప్రాంతీయ సమస్యలపై కూడా చర్చించినట్లు ప్రకటన పేర్కొంది.

పాకిస్థాన్ కొత్తగా ఎన్నికైన ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ తన మొదటి విదేశీ పర్యటనలో భాగంగా సౌదీ అరేబియాను సందర్శిస్తున్నారు. ఈ పర్యటనలో ప్రస్తుతం షరీఫ్ బిజీబిజీగా ఉన్నారు. అయితే కశ్మీర్ అంశంపై సౌదీ అరేబియా పాకిస్థాన్‌కు షాకిచ్చింది. కాశ్మీర్ అనేది భారత్, పాకిస్థాన్‌ల మధ్య ద్వైపాక్షిక సమస్య అని సౌదీ స్పష్టంగా చెప్పింది. దీంతో పాటు భారత్‌తో మాట్లాడి పరిష్కారం కనుగొనాలని సౌదీ ప్రధాని షాబాజ్‌కు సూచించారు. సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ సంయుక్త ప్రకటన వెలువరిస్తూ కాశ్మీర్ సహా ఇతర పెండింగ్ సమస్యలను పరిష్కరించడానికి న్యూఢిల్లీ, ఇస్లామాబాద్ మధ్య చర్చల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.
In a joint statement, Saudi Arabia and Pakistan stressed the importance of dialogue between Pakistan and India to resolve the outstanding issues between the two countries, (especially the Jammu and Kashmir dispute) to ensure peace and stability in the region. pic.twitter.com/rit3MNKsFY
— ANI (@ANI) April 9, 2024
కాశ్మీర్ సహా ప్రాంతీయ సమస్యలపై చర్చ
మక్కాలోని అల్-సఫా ప్యాలెస్‌లో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ మధ్య అధికారిక సమావేశం జరిగిన ఒక రోజు తర్వాత విడుదల చేసిన ఒక సంయుక్త ప్రకటనలో ఈ విషయాన్నీ వెల్లడించింది. ఈ ప్రకటన ప్రకారం సౌదీ అరేబియా, పాకిస్తాన్ మధ్య సోదర సంబంధాలను బలోపేతం చేయడం, వివిధ రంగాలలో సహకారాన్ని పెంచుకోవడానికి మార్గాలను కనుగొనడంపై దృష్టి పెట్టింది. కశ్మీర్ సహా ప్రాంతీయ సమస్యలపై కూడా చర్చించినట్లు ప్రకటన పేర్కొంది.
పాకిస్తాన్, భారతదేశం మధ్య చర్చలు
ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతను నిర్ధారించడానికి భారత్, పాక్ మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలను, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ వివాదాన్ని పరిష్కరించడానికి పాకిస్తాన్, భారతదేశం మధ్య చర్చల ప్రాముఖ్యతను ఇరుపక్షాలు నొక్కిచెప్పాయి. కాశ్మీర్ అనేది భారతదేశం, పాకిస్తాన్‌ల మధ్య ద్వైపాక్షిక సమస్య అని.. ఈ విషయంలో మూడవ పక్షం మధ్యవర్తిత్వం లేదా జోక్యానికి సంబంధించిన ప్రశ్నే లేదని ఎప్పుడూ కేంద్ర ప్రభుత్వం చెబుతూనే వస్తోంది.
భారత్ – రియాద్ మధ్య సంబంధాలు
సౌదీ అరేబియాతో సహా అరబ్ దేశాలతో భారతదేశం, పాకిస్థాన్‌లు చాలా కాలంగా స్నేహపూర్వక సంబంధాలను కలిగి ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హయాంలో న్యూఢిల్లీ, రియాద్ మధ్య సంబంధాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. జమ్మూ కాశ్మీర్ విషయంలో సౌదీ అరేబియా సమతుల్య వైఖరిని కొనసాగిస్తోంది. ఆగస్టు 2019లో ఆర్టికల్ 370ని భారతదేశం రద్దు చేయడంపై ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ, భారత్ తీసుకున్న చర్యలను స్పష్టంగా ఖండించలేదు. బదులుగా దీనిని భారత్ అంతర్గత విషయంగా పేర్కొంది.
భారతదేశాన్ని ఒప్పించాలని కోరిన పాక్ ప్రధాని
2019లో కాశ్మీర్ సమస్యకు శాంతియుత పరిష్కారంపై చర్చలు ప్రారంభించేలా భారత్‌ను ఒప్పించాలని పాకిస్థాన్ అమెరికాను కోరింది. అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాశ్మీర్ సమస్యపై ఇరుదేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించాలని ప్రతిపాదించినప్పుడు ఇది జరిగింది. అయితే ఈ అంశంపై ఏదైనా చర్చ అవసరమైతే పాకిస్థాన్‌తో మాత్రమే జరుగుతుందని అది కూడా ద్వైపాక్షికంగా మాత్రమే జరుగుతుందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్ భారత్‌లో ఎప్పటికీ అంతర్భాగమేనని పాకిస్థాన్‌కు భారత్ పదే పదే చెబుతోంది. ఉగ్రవాదం, శత్రుత్వం, హింస లేని వాతావరణంలో పాకిస్థాన్‌తో సాధారణ పొరుగు సంబంధాలను కోరుకుంటున్నామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




