AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రంజాన్ సందర్భంగా ఆ ముస్లిం దేశంలో అనధికారిక లాక్‌డౌన్.. తిన్నా, తాగినా భారీ జరిమానా, జైలు శిక్ష..

రంజాన్ సందర్భంగా ఈ ముస్లిం దేశంలో లాక్‌డౌన్ వంటి పరిస్థితులు కనిపిస్తాయి. ఎవరైనా పగటిపూట తింటూ లేదా తాగుతూ పట్టుబడితే అతనికి 1,000 మలేషియా రింగిట్ (సుమారు రూ. 16 లక్షలు) జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు రంజాన్ సందర్భంగా చేసిన తప్పుకు ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష విధించబడుతుంది, అంతేకాదు రంజాన్ సందర్భంగా ముస్లింలకు ఆహారం లేదా పానీయాలు లేదా పొగాకు విక్రయిస్తూ పట్టుబడిన ముస్లిమేతరులకు కూడా జరిమానా విధించబడుతుంది.

రంజాన్ సందర్భంగా ఆ ముస్లిం దేశంలో అనధికారిక లాక్‌డౌన్.. తిన్నా, తాగినా భారీ జరిమానా, జైలు శిక్ష..
Moral Policing
Surya Kala
|

Updated on: Apr 09, 2024 | 9:56 AM

Share

ముస్లిం దేశం మలేషియాలో రంజాన్ సందర్భంగా లాక్డౌన్ వంటి పరిస్థితులు కనిపిస్తాయి. మలేషియాలో రంజాన్ నెలలో నైతిక పోలీసింగ్ తీవ్రతరం అవుతుంది. ఎవరైనా తినడం లేదా త్రాగడం లేదా రంజాన్ నిబంధనలను ఉల్లంఘించినట్లయితే అతను శిక్షించబడతాడు. ఇంకా చెప్పాలంటే ఎవరైనా పగలు తింటూ లేదా తాగుతూ పట్టుబడితే 1,000 మలేషియా రింగిట్ (సుమారు రూ. 16 లక్షలు) జరిమానాతో పాటు ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష విధించబడుతుంది. అంతేకాకుండా రంజాన్ సందర్భంగా ముస్లింలకు ఆహారం లేదా పానీయాలు లేదా పొగాకు విక్రయిస్తూ పట్టుబడిన ముస్లిమేతరులకు కూడా జరిమానా విధించబడుతుంది.

మలేషియా జనాభా

ఇస్లామిక్ క్యాలెండర్‌లో రంజాన్ అత్యంత పవిత్రమైన మాసంగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో ముస్లింలందరూ ఉపవాసం ఉంటారు. దీని కారణంగా వారు పగటిపూట తినడానికి, త్రాగడానికి దూరంగా ఉంటారు. సూర్యాస్తమయం తర్వాత ఉపవాసాన్ని విరమిస్తారు. మలేషియాలోని అనేక ప్రాంతాల్లో పగలు ఎవరినా తింటూ, లేదా తాగుతూ పట్టుబడితే వారిపై మోరల్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారు. మలేషియా దేశంలోని మొత్తం 34 మిలియన్ల జనాభాలో దాదాపు 20.6 మిలియన్లు ముస్లింలు. అయితే దేశంలో బౌద్ధులు, క్రైస్తవులు, హిందువులతో పాటు చైనీస్ , భారతీయ మైనారిటీలు కూడా ఉన్నారు. దేశంలో షరియా చట్టం అమల్లో ఉంది. దీంతో ముస్లిం వివాహం, విడాకులు, ఉపవాసం వంటి అనేక సామాజిక సమస్యలకు షరియా చట్టం నిబంధనలు పనిచేస్తాయి.

ఇవి కూడా చదవండి

2023లో ఎన్ని అరెస్టులు జరిగాయంటే

రంజాన్ సందర్భంగా మతపరమైన పోలీసులు తమ పెట్రోలింగ్‌ను పెంచుతారు. నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిని పట్టుకోవడానికి ప్రసిద్ధ రెస్టారెంట్‌లలో పెట్రోలింగ్ చేస్తారు. ఎవరైనా తింటున్నట్లు లేదా తాగుతున్నట్లు చూస్తే శిక్షించబడతారు. ఈ సంవత్సరం అరెస్టు గణాంకాలు ఇంకా విడుదల కాలేదు. అయితే 2023లో మలక్కా రాష్ట్రంలోని మతపరమైన అధికారులు రంజాన్ మాసంలో తింటూ పట్టుబడిన దాదాపు 100 మంది ముస్లింలను అరెస్టు చేశారు.

జైమ్ ప్రకటించింది

ఈ సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా 10కి పైగా “హాట్‌స్పాట్‌లు” గుర్తించబడినట్లు మెలకా ఇస్లామిక్ రిలిజియస్ డిపార్ట్‌మెంట్ ఛైర్మన్ JAIM తెలిపారు. బార్లు, రెస్టారెంట్లు, మాల్స్ , పార్కులలో నిరంతరం పర్యవేక్షణ, తనిఖీలు జరుగుతున్నాయని రహ్మద్ మెర్రిమాన్ ప్రకటించారు. ఈ కార్యకలాపాల ద్వారా ఆహారం తింటున్న ముస్లింలను జైమ్ అధికారులు అదుపులోకి తీసుకుంటారని.. అదే సమయంలో వారికి ఆహారాన్ని అమ్మే వ్యాపారులపై కూడా చర్యలు తీసుకోవడానికి వెనుకాడరని మెర్రిమాన్ ఒక ప్రకటనలో తెలిపారు.

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..