AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తినే ఆహారమే కాదు ఈ అలవాట్లు కూడా పురుషుల్లో స్పెర్మ్ కౌంట్‌ తగ్గించేస్తాయట.. తస్మాత్ జాగ్రత్త సుమా..

మారిన జీవన శైలితో మనుషులు తినే ఆహారంలో కూడా అనేక మార్పులు వచ్చాయి. అలా తెలియకుండానే తప్పుడు ఆహారం తినడం వలన పురుషులలో స్పెర్మ్ పరిమాణం, నాణ్యత తగ్గుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అప్పుడు సంతానం విషయంలో సమస్యలు ఏర్పడతాయని ఇందుకు తగినంత ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు. కనుక లైంగిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరైన సమయంలో సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.

తినే ఆహారమే కాదు ఈ అలవాట్లు కూడా పురుషుల్లో స్పెర్మ్ కౌంట్‌ తగ్గించేస్తాయట.. తస్మాత్ జాగ్రత్త సుమా..
Good Habits
Surya Kala
|

Updated on: May 15, 2025 | 11:00 AM

Share

తినే ఆహారానికి, స్పెర్మ్ కౌంట్ కి మధ్య సంబంధం ఉందా? అంటే అవును అని చెప్పాలి. ఈ రెండిటికి మధ్య సంబంధం తప్పకుండా ఉంది. సరైన ఆహారం తినకపోయినా, తప్పుడు ఆహారాలు తినడం వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. కనుక పురుషులు లైంగిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరైన సమయంలో సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన స్పెర్మ్ కౌంట్‌ను నిర్వహించడానికి ఏమి తినాలో? ఏమి తినకూడదో డాక్టర్ సుదీప్ సమంత్ చెప్పిన విషయాలను గురించి ఈ రోజు తెలుసుకుందాం..

స్పెర్మ్ కౌంట్‌ను నిర్వహించడానికి లేదా పెంచడానికి మొదటి నియమం సరైన జీవనశైలి. అంటే ఏడు నుంచి ఎనిమిది గంటలు గాఢంగా నిద్రపోవడం, ఒత్తిడి లేకుండా ఉండటం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం. పురుషుడు ఎంత చురుగ్గా ఉంటే.. అతని స్పెర్మ్ కౌంట్ అంత ఎక్కువగా ఉంటుంది.

వైద్యుల అభిప్రాయం ప్రకారం మద్యం స్పెర్మ్ కౌంట్ కి అతి పెద్ద విలన్. అధికంగా మద్యం సేవించడం వల్ల స్పెర్మ్ కౌంట్ ఎక్కువగా దెబ్బతింటుంది. అయితే మద్యం తాగడం మాత్రమే కాదు అతిగా ధూమపానం చేయడం వల్ల కూడా స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. చిప్స్ వంటి ఫాస్ట్ ఫుడ్ ను క్రమం తప్పకుండా తినేవారిలో వీర్యకణాల సంఖ్య వేగంగా తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

స్పెర్మ్ కౌంట్‌ను ఎలా నిర్వహించాలంటే

  1. ఉదయాన్నే నిద్ర లేచి తేలికపాటి వ్యాయామం చేయండి. రోజూ జిమ్‌కి వెళ్తే చాలా మంచిది. రోజంతా చురుకుగా, ప్రశాంతంగా గడపండి.
  2. తినే ఆహారంలో పుష్కలంగా కూరగాయలు చేర్చుకోండి. రోజుకు కనీసం ఒక పండు తినండి. మీరు పుచ్చకాయ, ఆపిల్, జామ తినవచ్చు.
  3. ఒత్తిడిని తగ్గించుకోండి. మొబైల్ వాడకాన్ని తగ్గించండి.
  4. మానసికంగా ప్రశాంతంగా ఉండేలా పుస్తకాలు చదవండి . సినిమాలు చూడండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

ఎల్‌ఐసీ నుంచి కొత్త ప్లాన్.. 100 సంవత్సరాల వరకు జీవిత బీమా..!
ఎల్‌ఐసీ నుంచి కొత్త ప్లాన్.. 100 సంవత్సరాల వరకు జీవిత బీమా..!
బంగారం vs వెండి.. 2026లో ఏది కొంటే లాభం.. కనకవర్షం కురిపించేది..
బంగారం vs వెండి.. 2026లో ఏది కొంటే లాభం.. కనకవర్షం కురిపించేది..
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!