AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: పరగడుపున ఈ ఆహారాన్ని అస్సలు తినొద్దు.. చాలా డేంజర్.. ఎందుకో తెలుసుకోండి!

పౌష్టికాహారం తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని డాక్టర్లు చెబుతుంటారు. అసలే కరోనాకాలం కావడంతో ప్రజలు..

Health Tips: పరగడుపున ఈ ఆహారాన్ని అస్సలు తినొద్దు.. చాలా డేంజర్.. ఎందుకో తెలుసుకోండి!
Fruits
Ravi Kiran
|

Updated on: Aug 16, 2021 | 9:43 AM

Share

పౌష్టికాహారం తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని డాక్టర్లు చెబుతుంటారు. అసలే కరోనాకాలం కావడంతో ప్రజలు ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెడుతున్నారు. ఫ్రూట్స్, డ్రైఫ్రూట్స్, వెజిటబుల్స్.. ఇలా పోషకాలు నిండిన మంచి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే ఏ ఆహారాన్ని ఏ సమయంలో తీసుకోవాలో ఖచ్చితంగా తెలుసుకోవడం ముఖ్యమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు,

కొన్ని ఆహారాలను పరగడుపున తినడం వాళ్ళ చాలా ప్రయోజనం ఉంటుంది. అయితే మరికొన్ని ఖాళీ కడుపుతో తీసుకుంటే లేనిపోని ఆరోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మరి పరగడుపున తినకూడదని ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కార్బోనేటేడ్ పానీయాలు..

కార్బొనేటెడ్ పానీయాలు ఆరోగ్యానికి ఎల్లప్పుడూ హానికరమే. ఖాళీ కడుపుతో కార్బోనేటేడ్ పానీయాలను తాగడం వల్ల క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల వచ్చే అవకాశం ఉంటుంది. అంటే కాకుండా గుండె సంబంధిత వ్యాధుల బారిన కూడా పడవచ్చు.

సిట్రస్ పండ్లు..

ఉదయం లేచిన వెంటనే చాలామందికి ఆకలిగా అనిపిస్తుంది. ఫ్రిడ్జ్‌లో దొరికిన ఏ ఫుడ్‌నైనా తీసుకుని తింటారు. అయితే ఖాళీ కడుపుతో ద్రాక్షపండు, మొసాంబి, నారింజ, నిమ్మ వంటి సిట్రస్ పండ్లను తింటే.. చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సిట్రస్ పండ్లలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయని మనందరికీ తెలుసు. వీటిని పరగడుపున తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అందుకే ఈ పండ్లను ఖాళీ కడుపుతో ఎప్పుడూ తినకూడదని గుర్తుంచుకోండి.

టమాటా..

టమాటాలను ఖాళీ కడుపుతో అస్సలు తినకూడదు. వీటిల్లో గణనీయమైన మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లను ఉంటాయని మనకు తెలిసిందే. పరగడుపున టమాటాలు తింటే, ప్రయోజనానికి బదులు ఆరోగ్యానికి హాని కలుగుతుంది. వాటిల్లో ఉండే అమ్లత్వం కడుపు సంబంధిత సమస్యలు కలిగిస్తుంది.

అరటి..

అరటిపండు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు అరటిలో ఉంటాయి. అయితే అరటిపండును మాత్రం ఖాళీ కడుపుతో తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. దానిలో ఉండే పోషక అంశాలు.. శరీరంలో ఉండే కాల్షియం, మెగ్నీషియం స్థాయిలలో అసమతుల్యతను కలిగిస్తాయి.

Also Read:

జింకను వేటాడేందుకు నక్కిన చిరుత.. చివరికి షాకింగ్ సీన్.. వీడియో చూస్తే షాకవుతారు!

చాణక్య నీతి: ఈ మూడు అలవాట్లు ఉంటే.. యువత జీవితం నాశనం అయినట్లే.. అవేంటంటే.!

 ఈ ఫోటోలో పులి దాగుంది.. మీరు గుర్తించగలరా.? ఈజీగా కనిపెట్టొచ్చు చూడండి.!

ఎనిమిదో స్థానంలో సుడిగాలి ఇన్నింగ్స్.. టీమిండియాకు సూపర్ విక్టరీ.. గెలిపించిన బెస్ట్ ఆల్‌రౌండర్!

Follow Us
వ్యర్థాల నుంచి కోట్లాది రూపాయల వ్యాపారం.. పనస గింజలతో కాఫీ తయారు
వ్యర్థాల నుంచి కోట్లాది రూపాయల వ్యాపారం.. పనస గింజలతో కాఫీ తయారు
గుడ్ న్యూస్.. ఇవాళ మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు..
గుడ్ న్యూస్.. ఇవాళ మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు..
ఈ మొక్కను ఇలా వాడితే.. జుట్టు నల్లగా మారడమే కాదు.. వద్దన్నా ..
ఈ మొక్కను ఇలా వాడితే.. జుట్టు నల్లగా మారడమే కాదు.. వద్దన్నా ..
పూరీ జగన్నాథ ఆలయంలోని మూడో మెట్టు రహస్యం.. యమశిలపై అడుగు పెడితే..
పూరీ జగన్నాథ ఆలయంలోని మూడో మెట్టు రహస్యం.. యమశిలపై అడుగు పెడితే..
యూరిన్ సరిగా రానివాళ్ళు పూర్వీకుల తిన్నది తింటే.. నిముషాల్లోనే
యూరిన్ సరిగా రానివాళ్ళు పూర్వీకుల తిన్నది తింటే.. నిముషాల్లోనే
ఓటీటీలోకి వచ్చేసిన రామ్ చరణ్ 'పెద్ది'.. ఎక్కడ చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేసిన రామ్ చరణ్ 'పెద్ది'.. ఎక్కడ చూడొచ్చంటే?
జూలై 9 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగంలో శుభవార్తలు..
జూలై 9 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగంలో శుభవార్తలు..
పసుపు గణపతి మహిమ.. హరిద్రా గణపతి పూజతో విఘ్నాలు తొలగి ఐశ్వర్యం..
పసుపు గణపతి మహిమ.. హరిద్రా గణపతి పూజతో విఘ్నాలు తొలగి ఐశ్వర్యం..
సమస్య పరిష్కారానికి వినూత్న నిరసన.. ఏం చేశారో చూడండి
సమస్య పరిష్కారానికి వినూత్న నిరసన.. ఏం చేశారో చూడండి
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..