Jaggery Side Effects: బెల్లం ఎక్కువగా తింటున్నారా ? అయితే జాగ్రత్తగా.. శ్రుతిమించే ఈ ప్రమాదాలు..

బెల్లంలో అనేక పోషకాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందని.. ముఖ్యంగా శరీరంలో రక్తం పెంచుతుందని అంటారు.

Jaggery Side Effects: బెల్లం ఎక్కువగా తింటున్నారా ? అయితే జాగ్రత్తగా.. శ్రుతిమించే ఈ ప్రమాదాలు..
Jaggery
Follow us

|

Updated on: Aug 16, 2021 | 8:56 AM

బెల్లంలో అనేక పోషకాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందని.. ముఖ్యంగా శరీరంలో రక్తం పెంచుతుందని అంటారు. రోజూ ఉదయాన్నే కొద్దిగా బెల్లం తినడంలో వలన రక్తహీనత తగ్గుతుంది. కానీ ఏదైనా శ్రుతిమించితే ప్రమాదమే కదా.. ఇన్ని పోషకాలు కలిగిన బెల్లం అధిక మోతాదులో తీసుకున్న కూడా ప్రమాదమే. ఎక్కువగా బెల్లం తీసుకోవడం వలన ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఎలాగో తెలుసుకుందామా.

1. బెల్లం అధికంగా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటే బెల్లం ఎక్కువగా తీసుకోవడం ద్వారా బరువు పెరిగే అవకాశాలున్నాయి.. వాస్తవానికి బెల్లంలో పిండి పదార్థాలు, చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఇది బరువు పెరగడానికి కారణమవుతుంది.

2. శీతాకాలమైనా, వేసవికాలమైనా, ఏ సీజన్‌లోనైనా బెల్లం ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ముఖ్యంగా వేసవికాలంలో బెల్లం తీసుకోవడంలో జాగ్రత్త వహించాలి. ఎందుకంటే దీనిని అధికంగా తీసుకోవడం వల్ల ముక్కు నుండి రక్తస్రావం జరుగుతుంది. బెల్లం వేడిని కలుగజేస్తుంది. దీని కారణంగా రక్తస్రావం సమస్యను ఎదుర్కోవచ్చు.

3. బెల్లం అధికంగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరిగే సమస్య కూడా ఏర్పడుతుంది. బెల్లంలో సుక్రోజ్ ఉంటుంది. దీని కారణంగా రక్తంలో చక్కెర స్థాయి పెరగడం ప్రారంభమవుతుంది. మధుమేహంతో బాధపడుతున్న వ్యక్తులకు ఇది మరింత హానికరం.

4. బెల్లం అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు కలుగుతాయి. నిజానికి బెల్లంలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. అతిగా తీసుకోవడం వల్ల అతిసారం, కడుపు నొప్పి సమస్యలు కలుగుతాయి. దీంతోపాటు అలసట, తలనొప్పి, భయం వంటి సమస్యలు కూడా సంభవించవచ్చు.

5. బెల్లం అధికంగా తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం సమస్య కూడా ఏర్పడుతుంది. బెల్లంలో చక్కెర ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దీంతో శరీరంలో మంట సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కీళ్లనొప్పులతో సమస్యలు ఉన్నవారు బెల్లం తీసుకోవడం మానుకోవాలి.

Also Read: Raviteja: మరోసారి హిట్ కాంబో రిపీట్ కాబోతుందా ? సక్సెస్ ఫుల్ డైరెక్టర్‏తో మాస్ మాహారాజా..

Sree Vishnu: రాజ రాజ చోర ప్రీరిలీజ్ ఈవెంట్‏లో సంచలన వ్యాఖ్యలు చేసిన హీరో శ్రీవిష్ణు.. రాసి పెట్టుకొండి అంటూ..

దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ