AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raviteja: మరోసారి హిట్ కాంబో రిపీట్ కాబోతుందా ? సక్సెస్ ఫుల్ డైరెక్టర్‏తో మాస్ మాహారాజా..

చాలా కాలం తర్వాత మాస్ మాహరాజా.. ఇటీవల క్రాక్ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఈ మూవీ తర్వాతా రవితేజ వరుస సినిమాలను లైన్లో

Raviteja: మరోసారి హిట్ కాంబో రిపీట్ కాబోతుందా ? సక్సెస్ ఫుల్ డైరెక్టర్‏తో మాస్ మాహారాజా..
Raviteja
Rajitha Chanti
| Edited By: |

Updated on: Aug 16, 2021 | 10:16 PM

Share

చాలా కాలం తర్వాత మాస్ మాహరాజా.. ఇటీవల క్రాక్ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఈ మూవీ తర్వాతా రవితేజ వరుస సినిమాలను లైన్లో పెట్టేస్తున్నాడు. ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ సరసన డింపుల్ హయాతి హీరోయిన్‏గా నటిస్తోంది. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అటు ఈ మూవీ సెట్స్ పై ఉండగానే.. మరోవైపు రామారావు ఆన్ డ్యూటీ అనే చిత్రాన్ని కూడా ప్రారంభించాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఇందులో రవితేజ సరసన దివ్యాన్ష కౌశిక్, మలయాళ నటి రజీషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో సీనియర్ హీరో వేణు కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా రవితేజ మరో ప్రాజెక్ట్‏కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా టాక్ వినిపిస్తోంది.

గత కొద్ది రోజుల క్రితం మాస్ మాహరాజ రవితేజ.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శ్రీనువైట్లతో చర్చలు జరిపినట్లుగా సమాచారం. ఇటీవల రవితేజను కలిసిన శ్రీనువైట్ల.. ఆతనితో కలిసి పనిచేయాలనే కోరికను వ్యక్తిపరిచాడట. ఇందుకు రవితేజ కూడా సానుకూలంగా స్పందించినట్లుగా టాక్ వినిపిస్తోంది. త్వరలో వీరిద్దరి ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన రానున్నట్లుగా తెలుస్తోంది. అయితే గతంలో వీరిద్దరి కాంబోలో దుబాయ్ శ్రీను, వెంకీ వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం శ్రీనువైట్లు.. డి అండ్ డి సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.

Also Read: Sree Vishnu: రాజ రాజ చోర ప్రీరిలీజ్ ఈవెంట్‏లో సంచలన వ్యాఖ్యలు చేసిన హీరో శ్రీవిష్ణు.. రాసి పెట్టుకొండి అంటూ..

Mandira Bedi: మరచిపోవడానికి అతను జ్ఞాపకం కాదు.. జీవితమే తను.. భర్త పై భావోద్వేగ పోస్ట్ చేసిన సాహో బ్యూటీ..

Ram Charan: జాతీయ జెండాకు అవమానం.. చెర్రీని దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. ఇంతకీ ఎం జరిగిందంటే ?

Follow Us
వ్యర్థాల నుంచి కోట్లాది రూపాయల వ్యాపారం.. పనస గింజలతో కాఫీ తయారు
వ్యర్థాల నుంచి కోట్లాది రూపాయల వ్యాపారం.. పనస గింజలతో కాఫీ తయారు
గుడ్ న్యూస్.. ఇవాళ మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు..
గుడ్ న్యూస్.. ఇవాళ మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు..
ఈ మొక్కను ఇలా వాడితే.. జుట్టు నల్లగా మారడమే కాదు.. వద్దన్నా ..
ఈ మొక్కను ఇలా వాడితే.. జుట్టు నల్లగా మారడమే కాదు.. వద్దన్నా ..
పూరీ జగన్నాథ ఆలయంలోని మూడో మెట్టు రహస్యం.. యమశిలపై అడుగు పెడితే..
పూరీ జగన్నాథ ఆలయంలోని మూడో మెట్టు రహస్యం.. యమశిలపై అడుగు పెడితే..
యూరిన్ సరిగా రానివాళ్ళు పూర్వీకుల తిన్నది తింటే.. నిముషాల్లోనే
యూరిన్ సరిగా రానివాళ్ళు పూర్వీకుల తిన్నది తింటే.. నిముషాల్లోనే
ఓటీటీలోకి వచ్చేసిన రామ్ చరణ్ 'పెద్ది'.. ఎక్కడ చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేసిన రామ్ చరణ్ 'పెద్ది'.. ఎక్కడ చూడొచ్చంటే?
జూలై 9 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగంలో శుభవార్తలు..
జూలై 9 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగంలో శుభవార్తలు..
పసుపు గణపతి మహిమ.. హరిద్రా గణపతి పూజతో విఘ్నాలు తొలగి ఐశ్వర్యం..
పసుపు గణపతి మహిమ.. హరిద్రా గణపతి పూజతో విఘ్నాలు తొలగి ఐశ్వర్యం..
సమస్య పరిష్కారానికి వినూత్న నిరసన.. ఏం చేశారో చూడండి
సమస్య పరిష్కారానికి వినూత్న నిరసన.. ఏం చేశారో చూడండి
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..