Nightmares: పీడకలలు వస్తున్నాయా.. తేలికగా తీసుకుంటున్నారా? అది ఎంత డేంజరో తెలుసా!
సాధారణంగా ఎవరికైనా నిద్రలో కలలు వస్తూ ఉంటాయి. కొందరికి హ్యాపీగా ఉన్న కలలు వస్తే.. మరి కొందరికి పీడ కలలు వస్తూంటాయి. ఈ పీడ కలలతో భయ పడిపోతూ ఉంటారు. నిద్ర పోవడానికి బెదిరిపోతారు. కొంత మంది కలలో వచ్చిన పీడ కలలతో నిద్రలోనే కేకలు, అరుస్తూ ఉంటారు. అయితే తెల్లవారగానే అంతా మామూలుగా ఉంటారు. ఈ పీడ కలల్ని తేలికగా తీసుకుంటారు. నిద్రలో పీడ కలలు రావడం అనేది సాధారణమైన విషయం కాదు. ఇవి అంతర్లీనంగా పలు సమస్యలకు దారి..

సాధారణంగా ఎవరికైనా నిద్రలో కలలు వస్తూ ఉంటాయి. కొందరికి హ్యాపీగా ఉన్న కలలు వస్తే.. మరి కొందరికి పీడ కలలు వస్తూంటాయి. ఈ పీడ కలలతో భయ పడిపోతూ ఉంటారు. నిద్ర పోవడానికి బెదిరిపోతారు. కొంత మంది కలలో వచ్చిన పీడ కలలతో నిద్రలోనే కేకలు, అరుస్తూ ఉంటారు. అయితే తెల్లవారగానే అంతా మామూలుగా ఉంటారు. ఈ పీడ కలల్ని తేలికగా తీసుకుంటారు. నిద్రలో పీడ కలలు రావడం అనేది సాధారణమైన విషయం కాదు. ఇవి అంతర్లీనంగా పలు సమస్యలకు దారి తీస్తుంది. ఎవరికైతే పీడ కలలు వస్తాయో వారికి మతి మరుపు అనేది పెరుగిపోతూ ఉంటుంది. చిన్న వయసులోనే మతి మరుపు రావడం చాలా విషయాలు మర్చిపోయే అవకాశాలు లేక పోలేదు. ఇలా చిన్న విషయాలను మార్చిపోవడాన్ని డిమోన్షియా అని అంటారు.
పీడ కలలు వచ్చే వారిలోనే మతిమరుపు వచ్చే ప్రమాదం:
ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు పలు పరిశోధనలు చేశారు. దాదాపు 30 ఏళ్ల నుంచి 24 మధ్య వయసు ఉన్న వారిపై ఈ రీసెర్చ్ లు చేశారు. ఇలా దాదాపు 2,600 మందిపై జరిగిన పరిశోధనలపై పలు విషయాలను వెల్లడించారు నిపుణులు. సాధారణ మనుషులతో పోలిస్తే పీడ కలలు వచ్చే వారిలో త్వరగా మతి మరుపు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
సరైన నిద్ర అవసరం:
పీడ కలలు వచ్చే వారు డిమోన్షియా బారిన పడతారని తెలిపారు. పీడ కలలు వచ్చే వారు ఈ విషయాన్ని అస్సలు తేలికగా తీసుకోకూడదు. ఇలా నిద్రలో పీడ కలలు వచ్చే వారు.. తప్పనిసరిగా మానసిక వైద్యులను ఖచ్చితంగా సంప్రదించాలి. పీడ కలలు రావడం వల్ల మాత్రం చాలా ప్రమాదకరమైన విషయం అని నిపుణులు సూచిస్తున్నారు. సరైన నిద్ర లేకపోవడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఇలాంటి సమస్యలు వస్తే ముందు నిద్ర మీద ధ్యాస పెట్టాలి.
మగ వారిలోనే ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది:
మొబైల్ స్క్రీనింగ్ వంటి వాటివి తగ్గించి నిద్ర మీద దృష్టి పెట్టాలి. స్లీప్ అప్నియా వంటి సమస్యలు వచ్చినప్పుడు నిద్రలో శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు.. నిద్రలో పీడ కలలు వచ్చే సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అప్పుడు పీడ కలలు అధికంగా వచ్చే అవకాశం ఉంది. కాగా ప్రస్తుతం పీడ కలలకు, డిమోన్షియా మధ్య సంబంధాన్ని తేల్చడానికి మరింత లోతుగా అధ్యయనాలు చేస్తున్నారు నిపుణులు. కాగా ఈ పీడ కలలు ఆడవారి కన్నా మగ వారిలోనే వచ్చే అవకాశం ఉంది.
కాబట్టి మగవారికి వీలైనంత రెస్ట్ అవసరం. లేకుంటే వీరు డిమోన్షియా బారిన పడే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అదే విధంగా యాంటీ డిప్రెసెంట్లు వాడే వారిలో కూడా పీడ కలలు వచ్చే ప్రమాదం అధికంగా ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ట్రామా, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ వంటి జబ్బుల బారిన పడినా కూడా పీడ కలలు అధికంగా వస్తాయి. కాబట్టి నిద్ర లేకపోయినా ఇతర సమస్యలకు మెడిసిన్ వాడుతున్న వారు వీటిపై తగిన దృష్టి పెట్టాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.








