Eye Care: ఈ పండు తింటే కంటి చూపు బేషుగ్గా ఉంటుంది.. డోంట్ మిస్!
ప్రస్తుతం ఇప్పుడు అందరూ ఎదుర్కొనే సమస్యల్లో కంటి చూపు కూడా ఒకటి. ఎక్కువగా కంటప్యూటర్, లాప్ టాప్, మొబైల్, టీవీ స్క్రీనింగ్ చూడటం వల్ల కళ్లపై తీవ్రంగా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. దీంతో కంటి రెటీనా కూడా దెబ్బ తింటుంది. అంతే కాకుండా మారిన లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగా కూడా కంటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. నోటికి రుచైన ఫుడ్ తినడం వల్ల ఎన్నో వ్యాధులు, ఇన్ ఫెక్షన్లు సోకుతున్నాయి. డైలీ తీసుకునే ఆహారంలో కళ్లకు సంబంధించిన ఆహారం..

ప్రస్తుతం ఇప్పుడు అందరూ ఎదుర్కొనే సమస్యల్లో కంటి చూపు కూడా ఒకటి. ఎక్కువగా కంటప్యూటర్, లాప్ టాప్, మొబైల్, టీవీ స్క్రీనింగ్ చూడటం వల్ల కళ్లపై తీవ్రంగా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. దీంతో కంటి రెటీనా కూడా దెబ్బ తింటుంది. అంతే కాకుండా మారిన లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగా కూడా కంటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. నోటికి రుచైన ఫుడ్ తినడం వల్ల ఎన్నో వ్యాధులు, ఇన్ ఫెక్షన్లు సోకుతున్నాయి. డైలీ తీసుకునే ఆహారంలో కళ్లకు సంబంధించిన ఆహారం చేర్చడం ద్వారా కళ్ల సమస్యలను కంట్రోల్ చేసుకోవచ్చు. అయితే తాజాగా ద్రాక్ష తినడం వల్ల కళ్లకి మంచిదని తాజా అధ్యయనం చెబుతోంది. 34 మందిపై 16 వారాల పాటు సాగిన ఈ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.
వృద్ధాప్య వయసులో వచ్చే కంటి సమస్యలకు చెక్:
ద్రాక్ష తినడం వల్ల కంటి సమస్యలను తగ్గించుకోవద్దని అధ్యయనంలో తేలింది. అంతే కాకుండా ముఖ్యంగా వృద్ధాప్య వయసులో వచ్చే కంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ద్రాక్ష తినడం వల్ల మానవుల్లో కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవచ్చని తాజాగా అధ్యయనం చూపించింది. ద్రాక్ష అందరికీ అందుబాటులో ఉండే పండు. కాబట్టి తక్కువ ధరలోనే లభ్య మవుతుంది. ప్రతి రోజు కప్పున్నర ద్రాక్ష పండ్లను తీసుకోవాలి.
నాలుగు నెలల్లో మార్పు కనిపిస్తుంది:
క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పెద్ద వారిలో కంటి ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఆక్సీడేటివ్ స్ట్రెస్ కారణంగా కంటి చూపు అనేది క్షీణిస్తుంది. శరీరంలో తగినంత యాంటీ ఆక్సిడెంట్లు లేనందున కళ్ల కణాలు దెబ్బతింటాయి. కేవలం నాలుగు నెలల పాటు రోజుకు రెండు పూటలా ద్రాక్ష తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగు పడుతుంది. ద్రాక్ష తినడం వల్ల ఎలాంటి కంటి సమస్యలైనా దూరం చేసుకోవచ్చు.

ద్రాక్షతో కంటి సమస్యలే కాకుండా.. ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి:
– ప్రతి రోజు ద్రాక్ష తినడం వల్ల కాలేయంలోని కొవ్వు కరుగుతుంది. మనిషి ఆయుష్హు కూడా పెరుగుతుంది. – మెదడు ఆరోగ్యంగా పని చేస్తూ, యాక్టీవ్ అవుతుంది. – ద్రాక్షను ప్రతి రోజూ తినే వారిలో సహజ మరణం నాలుగు లేదా ఐదేళ్ల పాటు వాయిదా పడుతుంది. – ద్రాక్షను తినడం వల్ల జీర్ణ క్రియ పెరుగుతుంది. – ద్రాక్ష మెటబాలిజం సిండ్రోమ్ ను తగ్గిస్తుంది. – ద్రాక్షలో ఇన్ ఫ్లమ్మేటరీ లక్షణాలు ఉంటాయి కాబట్టి మధుమేహం ఉన్న వారికి చక్కగా పని చేస్తుంది – గుండెను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు తల నొప్పి రాకుండా అడ్డుకుంటుంది. – ద్రాక్ష బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. ఇందులో కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి కొన్ని తిన్నా పొట్ట నిండిన భావన కలుగుతుంది. దీంతో ఇతర ఫుడ్ మీద ధ్యాస మల్లదు. కాబట్టి ఈజీగా వెయిట్ లాస్ అవ్వొచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.








