జుట్టు బలంగా, పొడుగ్గా, అందంగా ఉండాలని అనుకోని వారుండరు. అందంగా ఉన్న వారికి జుట్టు మరింత రెట్టింపు అందాన్ని ఇస్తుంది. రకరకాల హెయిర్ స్టైల్స్ వల్ల ఆకర్షణీయంగా కనిపిస్తారు. అయితే మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్ల వల్ల జుట్టు బలమీనంగా, నిర్జీవంగా మారిపోతుంది. జుట్టు ఊడిపోవడం వల్ల కూడా చాలా మంది మానసికంగా కూడా ఆందోళన చెందుతున్నారు.