AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Home Decor Tips: ఈ చిన్న మార్పులతో మీ ఇంటి లుక్కే మారిపోతుంది!

ఇంటిని అందంగా మార్చడంలో ప్రతి మహిళకు ఒక్కో కళ ఉంటుంది. ఇంటిని అందంగా ఉంచాలని అనుకోని మహిళ ఉండదు. కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల ఇంటిని అందంగా మార్చుకోవచ్చు. అయితే వాటిల్లో కొత్త దనం కనిపించేలా చేయాలి. ఎప్పుడూ ఒకేలా కాకుండా.. ప్రస్తుతం ఇప్పుడు లైఫ్ స్టైల్ కి తగ్గట్టుగా మార్చుకుంటే.. మీ ఇల్లు కూడా మెరిసి పోతుంది. ఇంటిని అలంకరించే సమయంలో ఈ టిప్స్ మీకు యూజ్ అవుతాయోమో..

Home Decor Tips: ఈ చిన్న మార్పులతో మీ ఇంటి లుక్కే మారిపోతుంది!
Home Decor Tips
Chinni Enni
|

Updated on: Oct 19, 2023 | 1:27 PM

Share

ఇంటిని అందంగా మార్చడంలో ప్రతి మహిళకు ఒక్కో కళ ఉంటుంది. ఇంటిని అందంగా ఉంచాలని అనుకోని లేడీస్ ఉండదు. ఇంటి అందంగా, ఆరోగ్యంగా ఉండేలా చేయడంలో మహిళల తర్వాతే ఎవరైనా. కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల ఇంటిని అందంగా మార్చుకోవచ్చు. అయితే వాటిల్లో కొత్త దనం కనిపించేలా చేయాలి. ఎప్పుడూ ఒకేలా కాకుండా.. ప్రస్తుతం ఇప్పుడు లైఫ్ స్టైల్ కి తగ్గట్టుగా మార్చుకుంటే.. మీ ఇల్లు కూడా మెరిసి పోతుంది. అంతే కాకుండా చూపరులను ఆకర్షిస్తుంది కూడా. ఇంటిని అలంకరించే సమయంలో ఈ టిప్స్ మీకు యూజ్ అవుతాయోమో చూడండి.

మొక్కలు:

ఇప్పుడు ఇంట్లో మొక్కలు పెంచుకోవడం కూడా ఫ్యాషన్ గా ఫీల్ అవుతున్నారు. కాబట్టి వంట గదిలో, హాలులో, బెడ్ రూమ్ లో, డైనింగ్ టేబుల్ మీద ఇలా ఎక్క ఖాళీ ఉంటే అక్కడ ఓ మొక్కను ఉంచండి. అది కుండీలో అయినా లేదా వేలాడే మొక్క అయినా మంచి లుక్ ఇస్తుంది. దీని వల్ల మీ ఇంటికి మంచి కొత్త లుక్ వస్తుంది.

ఇవి కూడా చదవండి

గోడను ఎగ్జిబిషన్ లా మార్చడం:

ఇప్పుడు చాలా మంది ఒక ఖాళీ గోడపై ఎక్కువగా ఒకే చోట ఫోటలను పెడుతున్నారు. ఇలా పెట్టడం వల్ల ఒక న్యూ లుక్ వస్తుంది. హోటల్స్, రెస్టారెంట్లు.. ఇలా చాలా చోట్ల ఫోటోలు దర్శనమిస్తున్నాయి. ఈ స్టైల్ ని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి.

హాలులో టీవీ డెకరేషన్:

ఇప్పుడు ఎవరు కొత్తగా ఇల్లు కట్టుకున్నా.. టీవీని పైకి పెద్దగా పెడుతున్నారు. అలాగే టీవీ చుట్టూ షెల్ఫ్ లు పెట్టుకుంటూ మంచి లుక్ ఇస్తున్నారు. కాబట్టి మీరు కూడా ఇలా ట్రే చేయండి. చూడటానికి అందంగా కనిపిస్తుంది.

గోడకు ట్రేలు వేలాడదీయడం:

ఇప్పుడు గోడకు ట్రేలను వేలాడ తీయడం కూడా ఫ్యాషన్ గా భావిస్తున్నారు. ముఖ్యంగా కిచెన్ లో, హాలులో వీటిని పెడితే మంచి లుక్ వస్తుంది. మీరు ఇప్పటికే ఇలాంటి డిజైన్స్ ని రెస్టారెంట్స్, హోటల్స్ లో పెట్టడం చూసే ఉంటారు. కాబట్టి కలర్ ఫుల్ అయిన ట్రేలను గోడకు తగిలిస్తే మంచి లుక్ వస్తుంది.

కళాత్మక చిత్రాలు పెట్టడం:

ఇప్పుడు కొన్ని కళాత్మక చిత్రాలు పెట్టడం వల్ల కూడా గోడలకు మంచి లుక్ వస్తుంది. కాబట్టి ఇలాంటి ఫొటో ఫ్రేమ్స్ పెట్టడం వల్ల నీటిగా కనిపిస్తూ ఉంటుంది. కావాలనుకున్న వారు ఇలా కూడా ట్రై చేయవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి