Naturally Black Hair: తెల్లజుట్టును సహజంగా నల్లగా మార్చుకోవచ్చు.. నువ్వుల నూనెలో ఇది మిక్స్ చేసి..
ఇందుకు ఆధునిక జీవన విధానం కారణంగా చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోతోంది. తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి అనేక రకాల రెమెడీలను అవలంబిస్తున్నారు. ఇందులో జుట్టుకు నూనె రాయడం కూడా ఒకటి. కొబ్బరి నూనె జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే నువ్వుల నూనె కూడా జుట్టును నల్లగా మార్చడంలో సహాయపడుతుంది. నువ్వుల నూనెలో చాలా ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. ఇవి జుట్టును నల్లగా మార్చడంలో సహాయపడతాయి.
ఈ మధ్యకాలం తెల్ల జుట్టు సమస్యలతో అన్ని వయసుల వారు ఇబ్బంది పడుతున్నారు. ఇందుకు ఆధునిక జీవన విధానం కారణంగా చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోతోంది. తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి అనేక రకాల రెమెడీలను అవలంబిస్తున్నారు. ఇందులో జుట్టుకు నూనె రాయడం కూడా ఒకటి. కొబ్బరి నూనె జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే నువ్వుల నూనె కూడా జుట్టును నల్లగా మార్చడంలో సహాయపడుతుంది. నువ్వుల నూనెలో చాలా ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. ఇవి జుట్టును నల్లగా మార్చడంలో సహాయపడతాయి. నువ్వుల నూనెతో జుట్టును నల్లగా మార్చుకోవడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం?
జుట్టు నల్లగా మారాలంటే గోరింటాకు నువ్వుల నూనెలో కలిపి అప్లై చేస్తే చాలు. ఇది సహజమైన పద్ధతి అని చెప్పవచ్చ. ఇది జుట్టును నల్లగా మార్చడంలో సహాయపడుతుంది. ఇది జుట్టును మెరిసేలా చేస్తుంది.. అంతే కాకుండా ఆరోగ్యంగా మార్చగలదు. అయితే నువ్వుల నూను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ మిశ్రమాన్ని ఎలా తయారు చేయాలి..
- ఒక కప్పు నువ్వుల నూనెను చిన్నని మంటపై అంటే గ్యాస్ సిమ్‌లో పెట్టి నెమ్మిదిగా వేడి చేయండి. అది కూడా మట్టి పాత్ర అయితే మంచి ఫలితాలు త్వరగా వస్తాయి.
- వేడి నూనెలో ఒక చెంచా హెన్నా పౌడర్ లేదా హెన్నా ఆకులను వేసి బాగా కలపాలి.
- ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకు పట్టించి మసాజ్ చేయండి.
- రాత్రంతా అలాగే ఉంచి ఉదయం మీ జుట్టును కడగాలి.
- అడుగేందుకు షాంపో కాకుండా కుంకుడు, శికాకాయి చేసిన మిశ్రమంతో తలను క్లీన్ చేయండి
కరివేపాకు కూడా జుట్టు నల్లగా మారడానికి ఉపయోగపడుతుంది. కరివేపాకును నువ్వుల నూనెలో కలిపి అప్లై చేయడం వల్ల జుట్టు నల్లగా మారుతుంది. ఇది కాకుండా, జుట్టు రాలడాన్ని నివారించడంలో.. వాటిని బలోపేతం చేయడంలో లోపలి నుంచి తేమగా చేయడంలో కూడా ఇది సహాయపడుతుంది. ఈ రెమెడీని క్రమం తప్పకుండా చేయడం వల్ల, జుట్టు క్రమంగా నల్లగా, ఆరోగ్యంగా మారుతుంది. కరివేపాకులో సహజ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి జుట్టు దెబ్బతినకుండా కాపాడతాయి. అంతే కాకుండా కరివేపాకులో జుట్టును నల్లగా మార్చే గుణాలు కూడా ఉన్నాయి. నువ్వుల నూనెలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు ఉంటాయి. ఇవి జుట్టుకు పోషణను అందిస్తాయి..
నోటు: ప్రియమైన రీడర్స్, మా ఈ వార్తను చదివినందుకు ధన్యవాదాలు. ఈ వార్త మీకు తెలియజేసే ఉద్దేశ్యంతో మాత్రమే వ్రాయబడింది. ఇది కేవలం సాధారణ సమాచారం సహాయం తీసుకున్నాము. మీరు ఎక్కడైనా మీ ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా చదివితే, దానిని స్వీకరించే ముందు ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించండి.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం