Lifestyle: బెల్లం, పెరుగు కలుపుకొని తీసుకుంటే ఏమవుతుందో తెలుసా.?
బెల్లం, పెరుగు ఇవి రెండు ఆరోగ్యానికి ఎంతగానే మేలు చేస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోని ఎన్నో ఔషధ గుణాలు మన ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. అయితే ఈ రెండింటిని కలిపి తీసుకుంటే ఎలా ఉంటుంది.? వినడానికి కాస్త వింతగా ఉంది కదూ! పెరుగు, బెల్లం కలపడం ఏంటని ఆలోచిస్తున్నారు కదూ! అయితే ఈ రెండింటి కాంబినేషన్ ఎంతో మంచిదని...

బెల్లం, పెరుగు ఇవి రెండు ఆరోగ్యానికి ఎంతగానే మేలు చేస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోని ఎన్నో ఔషధ గుణాలు మన ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. అయితే ఈ రెండింటిని కలిపి తీసుకుంటే ఎలా ఉంటుంది.? వినడానికి కాస్త వింతగా ఉంది కదూ! పెరుగు, బెల్లం కలపడం ఏంటని ఆలోచిస్తున్నారు కదూ! అయితే ఈ రెండింటి కాంబినేషన్ ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. పెరుగులో ఉండే కాల్షియం, ఫాస్పరస్.. బెల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఆరోగ్యాన్ని రక్షించడంలో సహాయపడతాయి. ఇంతకీ పెరుగు, బెల్లంను కలిపి తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* రక్తహీనత సమస్యతో బాధపడేవారికి పెరుగు, బెల్లం బెస్ట్ ఆప్షన్‌గా చెపొచ్చు. పెరుగు, బెల్లం రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో రక్తం పెరిగి రక్తహీనత సమస్య దూరమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
* జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయనప్పుడు మలబద్ధకం, కడుపు ఉబ్బరం, వాంతులు ఎక్కువగా కనిపిస్తాయి. పెరుగు, బెల్లం రోజూ తీసుకుంటే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఇది జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది.
* బరువు తగ్గాలనుకునే వారికి కూడా పెరుగు, బెల్లం బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. పెరుగు, బెల్లం తినడం వల్ల కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. దీంతో సహజంగానే ఆహారం తక్కువగా తీసుకుంటాం. ఇది బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది.
* రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు. నిత్యం ఏదో ఒక వ్యాధితో సతమతమయ్యే వారు పెరుగు, బెల్లాన్ని కలిపితీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ కాంబినేషన్ రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. జలుబు, దగ్గు వంటి వ్యాధులను దరిచేరకుండా చేస్తుంది.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం. కొందరిలో పెరుగు, బెల్లం కలిపి తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..
