AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lifestyle: షుగర్‌ పేషెంట్స్‌ మామిడి పండ్లు తినొచ్చా.? నిపుణులు ఏమంటున్నారంటే..

అయితే కొన్ని రకాల వ్యాధులతో బాధపడే వారు మామిడి పండ్లను తీసుకోవాలా వద్దా అన్న అనుమానాలు ఉండే ఉంటాయి. వీరిలో డయాబెటిస్‌ రోగుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మధుమేహంతో బాధపడేవారు మామిడి పండ్లు తింటే ప్రమాదకరమని చాలా మంది భావిస్తుంటారు. తియ్యగా ఉండే ఈ పండ్లతో షుగర్‌ లెవల్స్‌ పెరిగే అవకాశం ఉంటుందని...

Lifestyle: షుగర్‌ పేషెంట్స్‌ మామిడి పండ్లు తినొచ్చా.? నిపుణులు ఏమంటున్నారంటే..
Mango
Narender Vaitla
|

Updated on: Apr 22, 2024 | 8:36 AM

Share

సమ్మర్‌లో ఎండలు ఓ రేంజ్‌లో దంచికొట్టినా, చెమటతో ఇబ్బందులు పడ్డా సమ్మర్‌ వచ్చిందంటే మామిడి పండ్లు వస్తాయన్న సంతోషం అందరిలోనూ ఉంటుంది. మామిడి పండ్ల రుచి అలాంటిది. కింగ్‌ ఆఫ్‌ ఫ్రూట్స్‌గా పేరుగాంచిన మామిడి పండ్లను తినడానికి చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ఆసక్తిచూపిస్తుంటారు. ఇక మామిడి పండ్లతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. వీటిలోని ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి.

అయితే కొన్ని రకాల వ్యాధులతో బాధపడే వారు మామిడి పండ్లను తీసుకోవాలా వద్దా అన్న అనుమానాలు ఉండే ఉంటాయి. వీరిలో డయాబెటిస్‌ రోగుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మధుమేహంతో బాధపడేవారు మామిడి పండ్లు తింటే ప్రమాదకరమని చాలా మంది భావిస్తుంటారు. తియ్యగా ఉండే ఈ పండ్లతో షుగర్‌ లెవల్స్‌ పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తుంటారు. అయితే ఇందులో ఎంత నిజం ఉంది.? నిజంగానే మామిడి పండ్లు తింటే షుగర్‌ లెవల్స్‌ పెరుగుతాయా.? నిపుణులు ఏమంటున్నారు.? ఇప్పుడు తెలుసుకుందాం.

షుగర్‌ బాధితులు మామిడి పండ్లను తీసుకుంటే తరచూ వారి రక్తంలో చక్కెర స్థాయిలను చెక్‌ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ మామిడి పండ్లను తీసుకున్న తర్వాత షుగర్‌ లెవల్స్‌ అనూహ్యంగా పెరిగితే మాత్రం వాటికి దూరంగా ఉండడమే బెటర్‌ అని అంటున్నారు. అలాగే రక్తంలో షుగర్‌ ఎక్కువగా ఉన్న వారు మామిడి పండ్లను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు. అలాగే భోజనం చేసిన వెంటనే, పరగడుపన మామిడి పండ్లను తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. వీటివల్ల షుగర్‌ లెవల్స్‌ పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు.

మామిడి పండ్లలో షుగర్‌ స్థాయిలు ఉంటాయి అనడంలో నిజం ఉన్నా.. మామిడి పండ్లను మితంగా తీసుకోవడం వల్ల శరీరానికి మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. చక్కెర శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ.. తక్కువ కార్బోహైడ్రేట్స్​ఉంటాయని, అందుకే మామిడి పండ్లను మితంగా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించగలవని డాక్టర్లు చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..