AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lifestyle: పసుపు, తేనె కలిపి తీసుకుంటే ఏమవుతుందో తెలుసా.?

పసుపు, తేనె.. ఈ రెండింటికీ ఆయుర్వేదంలో ఎంతటి ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి మంచి గుణాలున్న తేనె, పసుపును కలిపి తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Lifestyle: పసుపు, తేనె కలిపి తీసుకుంటే ఏమవుతుందో తెలుసా.?
Honey And Turmeric Mix
Narender Vaitla
|

Updated on: Oct 30, 2024 | 6:41 PM

Share

ప్రస్తుతం ప్రతీ ఒక్కరికీ ఆరోగ్యంపై అవగాహన పెరుగుతోంది. చాలా మంది ఆయుర్వేద విధానాలను ఫాలో అవుతున్నారు. ఇంట్లో లభించే సహజ చిట్కాలను పాటిస్తున్నారు. పసుపు, తేనె ప్రాధాన్యత ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* ప‌సుపు, తేనె మిశ్ర‌మం జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుందని నిపుణులు అంటున్నారు. ఈ మిశ్ర‌మం స‌హ‌జ‌సిద్ధ‌మైన లాక్సేటివ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఇది సుఖ విరోచనానికి దోహదపడుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలన్నీ దూరమవుతాయి. కడుపుబ్బరం, గ్యాస్‌ వంటి సమస్యలను దూరం చేస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి ఈ మిశ్రమం బాగా ఉపయోగపడుతుంది.

* రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా ఈ మిశ్రంగా కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు అంటున్నారు. ఇందులోని విటమిన్‌ ఏ రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నాశ‌నం చేస్తాయి, క‌ణాల‌ను ర‌క్షిస్తాయి. ప‌సుపు, తేనె క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల ఇన్‌ఫెక్ష‌న్లు సైతం త‌గ్గుతాయి. అలాగే సీజనల్‌ వ్యాధులైన ద‌గ్గు, జ‌లుబు నుంచి ఉపశమనం కల్పించడంలో బాగా ఉపయోగపడుతుంది.

* కీళ్ల నొప్పుల సమస్యలను దూరం చేయడంలో ఈ మిశ్రం కీలకపాత్ర పోషిస్తుంది. వీటిలో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు బాగా ఉన్నాయి. నొప్పులు, వాపుల నుంచి ఉప‌శ‌మ‌నాన్ని అందిస్తాయి. ఆర్థ‌రైటిస్ నొప్పులు ఉన్న‌వారు ఈ మిశ్ర‌మాన్ని తీసుకుంటే ఫ‌లితం ఉంటుంది. కీళ్లు, మోకాళ్ళ నొప్పులు దూరమవుతాయి. వాపు తగ్గుతుంది.

* ఈ మిశ్రమం చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ప్రతీరోజూ ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవడం వల్ల ముడ‌త‌లు, మొటిమ‌లు, మ‌చ్చ‌లు తగ్గిపోతాయి. ముఖం కాంతివంతంగా మారుతుంది. చర్మం ప్రకాశిస్తుంది, యవ్వనంగా కనిపిస్తారు.

* మెదడు ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా ఈ మిశ్రం బాగా ఉపయోగపడుతుంది. దీంతో మ‌తిమ‌రుపు త‌గ్గుతుంది. జ్ఞాప‌క‌శ‌క్తి, ఏకాగ్ర‌త పెరుగుతాయి. మానసిక సమస్యలను దూరం చేయడంలో కూడా ఈ మిశ్రం కీలక పాత్ర పోషిస్తుందని అంటున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..