Sabja Seeds: డయాబెటిక్‌లో సబ్జా గింజల మ్యాజిక్.. ఈ విషయాలు తెలిస్తే షాకవుతారు..
శరీరంలోని బ్లడ్ షుగర్ లెవెల్‌ను కంట్రోల్‌లో ఉంచడంలో సహాయపడుతుంది. తక్కువ నీరు త్రాగడం, సరైన జీవనశైలి కారణంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తుంది. సబ్జా గింజలు వీలైనంత ఎక్కువ నీరు త్రాగడమే కాకుండా..
చెడు ఆహారపు అలవాట్లు, అస్తవ్యస్థమైన జీవనశైలి కారణంగా అనేక రోగాలు ప్రజలను వెంటాడుతున్నాయి. ప్రస్తుతం చాలా మంది ప్రజలు మధుమేహం, మలబద్ధకం వంటి సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. చిన్నవయసులోనే చాలా మంది మధుమేహం బారినపడుతున్నారు. నీరు, సరైన ఫైబర్ ఆహారాలు లేకపోవడం వల్ల మలబద్ధకం సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. ఇటువంటి సమస్యలను తగ్గించడానికి లేదా ఉపశమనం పొందడానికి ఇంటి నివారణలు చక్కటి ఫలితాలను ఇస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదంలో చాలా ప్రయోజనకరంగా భావించే సబ్జా గింజలతో మధుమేహం, మలబద్ధకాన్ని ఎలా నివారించవచ్చో ఇక్కడ తెలుసుకుందాం..
మధుమేహం నయం కాదు. కాని కొన్ని ఇంటి చిట్కాలు, ఆయుర్వేద ఔషధాలు తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్‌ను అదుపులో ఉంచుకోవచ్చునని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందులో ముఖ్యంగా సబ్జా విత్తనాలు మధుమేహులకు మంచి హోం రెమిడీగా చెబుతున్నారు. సబ్జా విత్తనాల్లో ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉన్నాయి. మీరు తరచుగా మలబద్ధకంతో బాధపడుతుంటే, ప్రతిరోజూ సబ్జా గింజలను తినండి. ఇందులో పీచు పుష్కలంగా ఉండి మలబద్దకాన్ని దూరం చేస్తుందని చెబుతున్నారు.
మధుమేహంతో బాధపడేవారు సబ్జా గింజలను తీసుకోవచ్చు. వీటిని నీళ్లలో నానబెట్టుకుని తాగటం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. ఖాళీ కడుపుతో సబ్జా నీటిని తాగటం వల్ల ఫలితం ఉంటుంది. శరీరంలోని బ్లడ్ షుగర్ లెవెల్‌ను కంట్రోల్‌లో ఉంచడంలో సహాయపడుతుంది. తక్కువ నీరు త్రాగడం, సరైన జీవనశైలి కారణంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తుంది. సబ్జా గింజలు వీలైనంత ఎక్కువ నీరు త్రాగడమే కాకుండా మూత్రనాళ ఇన్ఫెక్షన్లను కూడా నయం చేస్తాయి. అంతేకాదు.. తలనొప్పి, గొంతులో మంట, ఆస్తమా, తీవ్రమైన జ్వరం వంటి అనేక సమస్యల నుంచి సబ్జా గింజలు ఉపశమనం కలిగి నీళ్లలో సబ్జా గింజలను నానబెట్టుకొని, వాటిని తినేయాలని చెబుతున్నారు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..