తాళికట్టు వేళ.. పదే పదే లేచి వాష్‌రూమ్ అంటూ వెళ్లిన వరుడు..! కట్ చేస్తే పెళ్లి క్యాన్సిల్..?
పెళ్లి ముహూర్తానికి ఇంకా కొన్ని నిమిషాల వ్యవధి మాత్రమే ఉంది.. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అంగరంగ వైభవంగా జరుగుతున్నా జయమల కార్యక్రమంలో వరుడి ప్రవర్తన వింతగా అనిపించింది. అదేంటని ఆరా తీయగా, పెళ్లికొడుకు చేసిన పని అక్కడి వారందరినీ షాక్ అయ్యేలా చేసింది.
ప్రస్తుతం దేశంలో పెళ్లిళ సీజన్ నడుస్తోంది. ఈ క్రమంలోనే వివాహ వేడుకలు, పెళ్లి తంతుకు సంబంధించి రోజుకో వింత, విచిత్ర ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అలాంటిదే ఓ వివాహ వేడుకకు సంబంధించి తాజా ఉదంతం వెలుగులోకి వచ్చింది. పెళ్లి కోసం వధువు కుటుంబీకులు బాంక్వెట్ హాల్ బుక్ చేశాడు. లక్షలు ఖరీదు చేసి వందల మందికి భోజన ఏర్పాట్లు చేశారు. పెళ్లి ముహూర్తానికి ఇంకా కొన్ని నిమిషాల వ్యవధి మాత్రమే ఉంది.. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అంగరంగ వైభవంగా జరుగుతున్నా జయమల కార్యక్రమంలో వరుడి ప్రవర్తన వింతగా అనిపించింది. అదేంటని ఆరా తీయగా, పెళ్లికొడుకు చేసిన పని అక్కడి వారందరినీ షాక్ అయ్యేలా చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ సాహిబాబాద్‌లో ఓ ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. సాహిబాబాద్‌లోని షాహీద్‌నగర్‌లో ఓ పెళ్లివేడుక జరుగుతుండగా వరుడు మద్యం మత్తులో తూలిపోతూ కనిపించాడు. దాంతో ఆ వధువు తన పెళ్లిని ఆపేసుకుంది. సాహిబాబాద్‌లోని షహీద్‌నగర్‌కు చెందిన శశి ఠాకూర్ తన కుమార్తె అంజలి ఠాకూర్ వివాహం ఢిల్లీలోని గాంధీనగర్‌లో నివసిస్తున్న అవినాష్‌తో నిశ్చయించారు. పెళ్లి మూహూర్తం రానే వచ్చేసింది. భారీ ఊరేగింపుతో వరుడు మండపానికి చేరుకున్నాడు.. కానీ, పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన పెళ్లి కొడుకు పదే పదే లేచి వాష్ రూమ్ అంటూ వెళ్తున్నాడు.. దాంతో అతడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన వధువు తన స్నేహితులతో అతనిపై నిఘా పెట్టింది. పక్కకు వెళ్లిన అతడు ఏం చేస్తున్నాడో చూసి అందరూ షాక్ అయ్యారు.
వాష్ రూమ్‌కి వెళ్తున్నానంటూ చెప్పి వెళ్లిన అతడు.. తన స్నేహితులతో కూర్చుని డ్రగ్స్ తీసుకోవడం వధువు స్నేహితులు, బంధువుల కంటపడింది. సంప్రదాయం ప్రకారం ఎంతో నిష్టగా, ఉపవాసం ఉండి మరీ పెళ్లి చేసుకోవాల్సిన వరుడు ఇలాంటి పని చేయటంతో వారి పెళ్లి ఊహించని మలుపు తిరిగింది. వరుడి అసలు రూపం వెలుగులోకి రావడంతో పెళ్లి ఇంట్లో గందరగోళం నెలకొంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించి అతన్ని అరెస్ట్ చేయించారు. పెళ్లి కొడుకు మత్తుకు బానిసయ్యాడని తెలిసి వధువు పెళ్లిని నిరాకరించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..