Taj Mahal: తాజ్ మహల్‌కు బాంబు బెదిరింపు.. ఉలిక్కిపడిన ఆగ్రా.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్..

ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన తాజ్ మహల్‌కు బాంబు బెదిరింపు మెయిల్‌ రావటం కలకలం రేపింది. తాజ్ మహల్ ను పేల్చివేస్తామంటూ ఉత్తరప్రదేశ్ టూరిజం కార్యాలయానికి ఓ ఈమెయిల్ అందింది. వెంటనే అప్రమత్తమైన టూరిజం అధికారులు, పోలీసులు రంగంలోకి దిగారు.

Taj Mahal: తాజ్ మహల్‌కు బాంబు బెదిరింపు.. ఉలిక్కిపడిన ఆగ్రా.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్..
Taj Mahal
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 03, 2024 | 6:19 PM

గత కొంతకాలంగా బాంబు బెదిరింపు కాల్స్‌ ఎక్కువయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తులు దేశంలోని పలు విమానాశ్రయాలు, విమానాల్లో బాంబు ఉన్నట్టుగా బెదిరింపు కాల్స్ చేసిన ఘటనలు అనేకం వెలుగులోకి వచ్చాయి. దుండగుల బెదిరింపు కాల్స్‌తో అటు ప్రజలు, ఇటు అధికార యంత్రాంగాన్ని టెన్షన్‌లో పడేస్తుంటారు. తాజాగా ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన తాజ్ మహల్‌కు బాంబు బెదిరింపు మెయిల్‌ రావటం కలకలం రేపింది. తాజ్ మహల్ ను పేల్చివేస్తామంటూ ఉత్తరప్రదేశ్ టూరిజం కార్యాలయానికి ఓ ఈమెయిల్ అందింది. వెంటనే అప్రమత్తమైన టూరిజం అధికారులు, పోలీసులు రంగంలోకి దిగారు.

ఆగ్రాలోని తాజ్‌ మహల్‌ను బాంబులతో పేల్చేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్‌ చేసినట్టుగా అధికారులు వెల్లడించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తాజ్‌ మహల్‌ వద్ద బాంబ్‌ డిస్పోజల్‌ టీమ్‌లు, డాగ్‌ స్క్వాడ్స్‌తో రంగంలోకి దిగారు. తాజ్‌మహల్ పరిసర ప్రాంతాల్లో బాంబు స్వ్కాడ్‌, డాగ్‌స్క్వాడ్, ఇతర బృందాలు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాయి. కానీ అక్కడ అనుమానస్పద వస్తువులు ఏమీ కూడా కనపించలేదని అధికారులు వెల్లడించారు.

తాజ్‌మహల్‌కు వచ్చిన బెదిరింపు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై విచారణ చేస్తున్నామని ఏసీపీ తాజ్‌ సెక్యూరిటీ సయ్యద్‌ అరీబ్‌ అహ్మద్‌ తెలిపారు. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మెయిల్ వచ్చిన వెంటనే ఆగ్రా పోలీసులకు, ఇతర ఉన్నతాధికారులకు సమాచారం అందించామని ఉత్తరప్రదేశ్‌ డిప్యూటీ డైరెక్టర్ దీప్తి వాత్స పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..