సైలెంట్‌గా ఉంటే కలిగే లాభాలేంటో తెలుసా..? వెంటనే అలవాటు చేసుకుంటారు..!

పెద్ద పెద్ద శబ్దాలు, గట్టిగా అరుచుకోవడం వల్ల మన శరీరంతో పాటు మనస్సు, మెదడును కూడా ప్రభావితం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీంతో మనలో ఒత్తిడి పెరుగుతుందని చెబుతున్నారు. మానసిక ఆరోగ్యానికి మౌనం ఎంతో బాగా ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మౌనంగా ఉండడం వల్ల మనలో ఒత్తిడిని తగ్గిస్తుంది. మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. దీంతో హాయిగా నిద్ర పడుతుందని, రక్తపోటు సమతుల్యం అవుతుందని చెబుతున్నారు.

Jyothi Gadda

|

Updated on: Dec 03, 2024 | 3:39 PM

మౌనంగా ఉండడం వల్ల మెదడు ఆరోగ్యం చాలా బాగుంటుంది. మెదడుకు సంబంధించిన సమస్యలు దరి చేరకుండా ఉంటాయి. మీ మౌనంతో జ్ఞాపకశక్తిని కూడా పెంచుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు. రోజులో ఓ గంటపాటు మౌనంగా ఉండడం వల్ల మీలో క్రియేటివిటీని పెంచుకోవచ్చు అంటున్నారు నిపుణులు.

1 / 5
సైలెంట్‌గా ఉండటం వల్ల ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉంటారు. దీంతో నిద్రలేమి సమస్య నుంచి బయటపడవచ్చు అంటున్నారు. ఫలితంగా సుఖంగా, ప్రశాంతంగా నిద్రపోవడానికి వీలు అవుతుంది. అంతేకాదు, మౌనంగా ఉండడం వలన కమ్యూనికేషన్ కూడా పెరుగుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్‌ను ఇంప్రూవ్ చేసుకోవచ్చు.

2 / 5
ప్రశాంతతను పెంపొందించడానికి మౌనం బాగా పనిచేస్తుంది. రోజూ కాసేపు సైలెంట్‌గా ఉంటే ఎంతో ప్రశాంతంగా ఉండొచ్చు. ఒత్తిడి కూడా ఉండదు. దీంతో గుండె సమస్యలు కూడా రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, మౌనం వల్ల శరీరంలో రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది.

3 / 5
మీలో కోపం అదుపులో ఉండాలంటే మౌనం చక్కగా పనిచేస్తుంది. రోజూ కాసేపు సైలెంట్‌గా ఉండడం వల్ల కోపం బాగా తగ్గుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. మౌనంగా ఉంటే ప్రశాంతత వస్తుంది. దానితో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఆవేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల ముందుకు వెళ్లలేము. కానీ మౌనంగా ఉంటే అనుకున్నవి సాధించగలం అంటున్నారు నిపుణులు.

4 / 5
శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఫలితంగా సంతోషకరమైన జీవనాన్ని సాగించగలుగుతాం. కాబట్టి మౌనానికి ఉన్న శక్తిని అర్ధం చేసుకోవాంటున్నారు. కనీసం రోజుకు గంట సేపైనా నిశ్శబ్దంగా ఉండి మనం మన శరీరాన్ని, మనసును కంట్రోల్ లో ఉంచుకోవాలని మానసిక ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

5 / 5
Follow us