AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీరకాయ బెనిఫిట్స్ తెలిస్తే వదిలిపెట్టరు.. ఇమ్యూనిటీ పెరగడంతో పాటు, గుండెకు కూడా మంచిదే..!

బిరకాయలో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే బీరకాయలో జింక్, ఐరన్, పొటాషియం విటమిన్లతో పాటు ఎన్నో ఖనిజాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను మరింత మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా బీరకాయతో కలిగే ప్రయోజనాల్లో..

బీరకాయ బెనిఫిట్స్ తెలిస్తే వదిలిపెట్టరు.. ఇమ్యూనిటీ పెరగడంతో పాటు, గుండెకు కూడా మంచిదే..!
Ridge Gourd
Jyothi Gadda
|

Updated on: Dec 03, 2024 | 9:46 PM

Share

ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేసే పోషకాలు కూరగాయల్లో ఉంటాయి. అలాంటి కూరగాయల్లో బీరకాయ కూడా ఒకటి. బీరకాయలో తక్కువ కేలరీలతో పాటు ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లతో పాటు విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. బీరకాయ జీర్ణక్రియను మరింత మెరుగ్గా పనిచేసేలా చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో బీరకాయ ఎంతో మేలు చేస్తుంది.. బీరకాయ తీసుకోవడం వల్ల కలిగే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

బీరకాయలో నీరు, ఫైబర్‌ కంటెంట్ అధికంగా ఉంటుంది. బీరకాయలో విటమిన్ ఏ, సీ, ఐరన్‌, మెగ్నీషియం, విటమిన్ బి6, పొటాషియం, సోడియం లభిస్తాయి. ఇందులో మంచి మొత్తంలో పొటాషియం ఉంటుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మధుమేహం బాధితుల్లో రక్తంలోని షుగర్ స్థాయిలను నియంత్రించడంలో బీరకాయ ఎంతో మేలు చేస్తుంది. బీరకాయలో చరంటిన్ అనే పదార్ధం ఉంటుంది. ఇది రక్తంలోని షుగర్ స్ధాయిలు అదుపులో ఉండేలా చేస్తుంది. బీరకాయలో ఉండే పీచు పదార్ధం రక్తంలోని షుగర్ లెవల్స్ ఆకస్మికంగా పెరగడాన్ని నివారిస్తుంది. బీరకాయలో ఉండే మంచి మొత్తంలో పీచు ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది.

బరువును తగ్గించడంలో బీరకాయ సహాయపడుతుంది. ఆకలిని తగ్గించడమే కాకుండా అతిగా తినడాన్ని నివారిస్తుంది.. శరీరంలోని అదనపు నీటిని తొలగిస్తుంది. దీంతో శరీర బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది. అధిక బరువుతో ఇబ్బంది పడేవారు తరచూగా బీరకాయ తీసుకోవడం వల్ల లాభం ఉంటుంది. బీరకాయలో కొవ్వులు తక్కువగా ఉంటాయి. రోగ నిరోధక శక్తిని పటిష్టం చేయడానికి బీరకాయ చాలా ఉపయోగపడుతుంది. బిరకాయలో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే బీరకాయలో జింక్, ఐరన్, పొటాషియం విటమిన్లతో పాటు ఎన్నో ఖనిజాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను మరింత మెరుగుపరుస్తాయి.

ఇవి కూడా చదవండి

బీరకాయ చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. వృద్ధాప్య సంకేతాలను దూరం చేస్తుంది. బీరకాయలో ఉండే విటమిన్ సి, కెరిటన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. బీరకాయలో ఉండే సిలికా అనే ఖనిజం చర్మం, జుట్టు, గోళ్లు ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదం చేస్తుంది. బీరకాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మ సమస్యలు తీరిపోయి చర్మ సౌదర్యం పెరుగుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..v

Follow Us
అక్షయ తృతీయకు బంగారం షాక్.. గతేడాదితో పోలిస్తే గోల్డ్ ధర..
అక్షయ తృతీయకు బంగారం షాక్.. గతేడాదితో పోలిస్తే గోల్డ్ ధర..
ధర్మాజీపేటలో వరుస ఆలయ దొంగతనాలు.. హుండీలు, ఆభరణాలు మాయం!
ధర్మాజీపేటలో వరుస ఆలయ దొంగతనాలు.. హుండీలు, ఆభరణాలు మాయం!
కొత్త కారు కొనాలనుకుంటే ఇదే బెస్ట్‌ ఆప్షన్‌!
కొత్త కారు కొనాలనుకుంటే ఇదే బెస్ట్‌ ఆప్షన్‌!
మాజీ ఆర్మీ జవాన్.. తాగుడు అతడ్ని ఇంతలా దిగజార్చింది..
మాజీ ఆర్మీ జవాన్.. తాగుడు అతడ్ని ఇంతలా దిగజార్చింది..
అందుకే జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడారు..మల్లు రవి కీలక వ్యాఖ్యలు
అందుకే జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడారు..మల్లు రవి కీలక వ్యాఖ్యలు
టేస్ట్.. డబుల్ ఎనర్జీ.. ఎవ్వరికీ తెలియని రాగి లడ్డు రెసిపీ ఇదే..
టేస్ట్.. డబుల్ ఎనర్జీ.. ఎవ్వరికీ తెలియని రాగి లడ్డు రెసిపీ ఇదే..
పిల్లలకు ఇస్తున్న క్రీమ్ బిస్కెట్లలో అసలు క్రీమ్ ఉందా?
పిల్లలకు ఇస్తున్న క్రీమ్ బిస్కెట్లలో అసలు క్రీమ్ ఉందా?
రంగు పోయిన రోల్డ్ గోల్డ్ నగలకు ఇంట్లోనే మెరుగు
రంగు పోయిన రోల్డ్ గోల్డ్ నగలకు ఇంట్లోనే మెరుగు
ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే బల్లులకు చుక్కలే.. ఇలా చేస్తే ఒక్కటి కూడా
ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే బల్లులకు చుక్కలే.. ఇలా చేస్తే ఒక్కటి కూడా
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం సూపర్ న్యూస్.. దేశంలో ఎక్కడైనా..
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం సూపర్ న్యూస్.. దేశంలో ఎక్కడైనా..