భార్య కోసం కొన్న బంగారు గొలుసు.. కట్ చేస్తే.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు..

భార్య కోసం కొన్న బంగారు గొలుసు అతడి అదృష్టాన్ని మార్చేసింది. ఇది చిదంబరాన్ని ఒక్క రాత్రిలోనే కోటీశ్వరుడిగా మార్చేసింది. కాగా, ప్రస్తుతం ఈ వార్త విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే..

భార్య కోసం కొన్న బంగారు గొలుసు.. కట్ చేస్తే.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు..
Gold Chain For Wife
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 03, 2024 | 9:05 PM

సింగపూర్‌లో భారతీయ సంతతికి చెందిన వ్యక్తి రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. అతని కథ తన భార్యకు బంగారు గొలుసు కొనడంతో మొదలైంది. బాలసుబ్రమణ్యం చిదంబరం అనే వ్యక్తి నవంబర్ 24న ముస్తఫా జ్యువెలరీ షాపులో తన భార్యకు బంగారు గొలుసు కొనుగోలు చేశాడు. అదే అతని అదృష్టాన్ని మార్చేసింది.. ముస్తఫా జ్యువెలరీ నిర్వహించిన లక్కీ డ్రాలో ప్రథమ బహుమతి గెలుచుకున్నాడు బాలసుబ్రమణ్యం చిదంబరం. ఇది చిదంబరాన్ని ఒక్క రాత్రిలోనే కోటీశ్వరుడిగా మార్చేసింది. కాగా, ప్రస్తుతం ఈ వార్త విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

సింగపూర్‌లో 21 ఏళ్లుగా పనిచేసిన ప్రాజెక్ట్ ఇంజనీర్ బాలసుబ్రహ్మణ్యం చిదంబరం గత నవంబర్ 24న ముస్తఫా జ్యువెలరీ నిర్వహించిన లక్కీ డ్రాలో మొదటి బహుమతి గెలుచుకున్నాడు. అక్కడ తన భార్యకు కొనుగోలు చేసిన బంగారు గొలుసు ద్వారా అతడు లక్కీ డ్రా టికెట్‌ కొనుగోలు చేశాడు. ఆ టికెట్‌ లక్కీ డ్రాలో ఎంపికైంది.. దాంతో అతను మొత్తం US$1 మిలియన్ గెలుచుకున్నాడు. రాత్రికి రాత్రే లక్షాధికారి అయ్యాడు. బాలసుబ్రహ్మణ్యం తన తండ్రి వర్ధంతి సందర్భంగా వచ్చిన ఈ బహుమతిని అతడు తన తండ్రి ఆశీర్వాదంగా పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ముస్తఫా జ్యువెలరీ స్టోర్ టెస్సెన్‌సన్‌లోని సివిల్ సర్వీస్ క్లబ్‌లో వార్షిక ఈవెంట్‌లో భాగంగా ఈ డ్రాను నిర్వహించింది. 250 సింగపూర్ డాలర్లు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్న 250 మంది మాత్రమే ఇందులో పాల్గొనగలరు. ఇందులో బాలసుబ్రమణ్యం చిదంబరం తన భార్య కోసం 6 వేల సింగపూర్ డాలర్ల విలువైన బంగారు గొలుసును దుకాణంలో కొనుగోలు చేశాడు. దీంతో తొలి లక్కీ డ్రా విజేతగా నిలిచాడు.

వీడియో ఇక్కడ చూడండి..

బాలసుబ్రహ్మణ్యం చిదంబరం కోటీశ్వరుడయ్యారనే వార్త తెలియగానే అతడు భావోద్వేగానికి గురయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు నాన్నగారి నాలుగో వర్ధంతి. ఇది నాకు మా నాన్నగారి ఆశీర్వాదం అని చెప్పారు. సింగపూర్‌లో పనిచేసిన సంవత్సరానికి కృతజ్ఞతగా తన తల్లితో శుభవార్త పంచుకోవాలని, తన విజయాల్లో కొంత భాగాన్ని సమాజానికి విరాళంగా ఇవ్వాలని యోచిస్తున్నట్లు అతను చెప్పాడు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..