AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది మామూలు బెల్లం, పుట్నాలు కాదు..ఆరోగ్యానికి ఔషధ నిధి.. శక్తి బూస్టర్..!

బెల్లం, శనగ పప్పు తినడం వల్ల బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బెల్లం, శనగలు అనేవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే ప్రసిద్ధ , పోషకమైన కలయిక. శక్తిని పెంచే ఈ ఆహారాన్ని సూపర్ ఫుడ్ గా కూడా పిలుస్తారు. శనగలలో ప్రోటీన్, ఫైబర్, అవసరమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అయితే, సహజ తీపి పదార్ధం అయిన బెల్లం శక్తి, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది. అవి కలిపినప్పుడు, రుచి, పోషకాల సమతుల్యతను సృష్టిస్తాయి.

ఇది మామూలు బెల్లం, పుట్నాలు కాదు..ఆరోగ్యానికి ఔషధ నిధి.. శక్తి బూస్టర్..!
Jaggery With Chana
Jyothi Gadda
|

Updated on: Nov 12, 2025 | 2:17 PM

Share

శనగలు బెల్లం.. కలిపి తింటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వేయించిన శనగలు, బెల్లం కలిపి తినటం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. బెల్లం, శనగలను కలిపినపుడు అది విటమిన్లు, ఖనిజాలతో నిండిన మంచి పౌష్టికాహారం అవుతుంది. వేయించిన శనగల్లో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. బెల్లం యాంటీ యాక్సిడెంట్లతో నిండి ఉంటుంది. బెల్లంలో జింక్, సెలీనియంలు ఎక్కువగా ఉంటాయి. వేయించిన శనగలు విటమిన్ బి6, విటమిన్ సి, ఫోలేట్, నియాసిన్, థియామిన్, రిబోఫ్లేవిన్, మాంగనీస్, ఐరన్ ఇలా ఎన్నో విటమిన్స్ ఉంటాయి..

బెల్లం, వేయించిన శనగలు రెండూ జింక్‌తో నిండి ఉంటాయి, ఇది శరీరంలో 300 ఎంజైమ్‌లను యాక్టివేట్ చేస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడేవారికి ఈ రెండు కలిపి తింటే మంచిది. వారు పడుకునే ముందు రాత్రి కొంచెం వేపిన శనగలు, బెల్లంలను పాలతో కలిపి తీసుకోవాలి. ఇది మీ ఊపిరితిత్తులను శుభ్రం చేయడానికి మరియు కాలుష్య సంబంధిత వ్యాధుల నుండి త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది. బెల్లంలోని ఐరన్, శనగల్లోని ప్రోటీన్, రుతుస్రావం సమయంలో స్త్రీ రక్తం కోల్పోడానికి, తమను తాము తిరిగి శక్తివంతం చేసుకోవడానికి ఈ పోషకాలు రెండూ ముఖ్యమైనవి.

రక్తహీనత లేదా కడుపు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారిని శనగలు, బెల్లం కలిపి తినాలని నిపుణులు చెబుతున్నారు. పప్పులో ఫైబర్ పుష్కలంగా ఉన్నప్పటికీ, ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రెండింటినీ కలిపి తినడం మంచిది. ఇది శరీరంలోని ప్రతి బలహీనతను తొలగిస్తుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. దీనిలో ఉన్న పొటాషియం వాళ్ళ స్ట్రోక్, గుండెపోటు వంటి కార్డియాక్ సిస్టమ్ కు సంబంధించిన సమస్యలు రాకుండా సాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఈ ఫుడ్ బెస్ట్ ఆప్షన్. బెల్లం,శనగలు కలిపి తినడం వల్ల మీ జీవక్రియను పెంచుతుంది. ఉబకాయంతో బాధపడేవారిలో బరువు తగ్గడానికి సాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

బెల్లం వేడెక్కించే ప్రభావాన్ని కలిగి ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. శనగపప్పులో ఫైబర్ ఉంటుంది. ఇది పేగు ఆరోగ్యానికి, జీర్ణక్రియకు అద్భుతమైనది. బెల్లం, శనగ పప్పు తినడం వల్ల బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బెల్లం, శనగలు అనేవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే ప్రసిద్ధ , పోషకమైన కలయిక. శక్తిని పెంచే ఈ ఆహారాన్ని సూపర్ ఫుడ్ గా కూడా పిలుస్తారు. శనగలలో ప్రోటీన్, ఫైబర్, అవసరమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అయితే, సహజ తీపి పదార్ధం అయిన బెల్లం శక్తి, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది. అవి కలిపినప్పుడు, రుచి, పోషకాల సమతుల్యతను సృష్టిస్తాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై