AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

copper vessel : కాపర్ బాటిల్‌లో నీరు నిల్వ చేసి తాగితే వేయి ఆరోగ్య ప్రయోజనాలు..!

పొట్టలో ఏర్పడిన అల్సర్లు కూడా తగ్గుముఖం పట్టడంతో పాటు జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. రోజూ రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీరు తాగడం వల్ల కాలేయం, మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది. రాగి నీటిలో వుండే బ్యాక్టీరియాలను నాశనం చేస్తుంది. నీటి ద్వారా వ్యాపించే డయేరియా, జాండీస్ వంటి వ్యాధులు రాకుండా చేస్తుంది.

copper vessel : కాపర్ బాటిల్‌లో నీరు నిల్వ చేసి తాగితే వేయి ఆరోగ్య ప్రయోజనాలు..!
Copper Vessel
Jyothi Gadda
|

Updated on: Jul 10, 2024 | 3:15 PM

Share

మన శరీరానికి అవసరమైనన్నీ నీళ్లు తాగడం చాలా ముఖ్యం. శరీరంలో నీరు లేకపోతే రకరకాల వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. కొంతమంది తమ ఆరోగ్య ప్రయోజనాల కోసం రాగి సీసాలోని నీటిని తాగుతారు. అయితే, రాగి వాటర్ బాటిల్‌లో నీటిని 8గంటలు లేదా అంతకంటే ఎక్కువ సేపు ఉంచకూడదని అంటారు. ఇకపోతే, రాగి బాటిల్‌లో నీటిని తాగడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ చూద్దాం.

నేటి ఆధునిక బిజీ లైఫ్‌లో జీవనశైలి మార్పులు, చెడు ఆహారపు అలవాట్లు కారణంగా హైబీపీ, శరీరంలో హైకొలెస్ట్రాల్‌ సమస్యలు పెరుగుతున్నాయి. దీని కారణంగా గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. రోజూ రాగి పాత్రల్లో నిల్వ ఉంచిన నీరు తాగడం వల్ల..మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయులు తగ్గుతాయని, బీపీ, హార్ట్‌బీట్ అదుపులో ఉంటాయని పలు అధ్యయనాలు వెల్లడించాయి. తద్వారా గుండె జబ్బుల ప్రమాదం కూడా దూరమరవుతుందని నిపుణులు చెబుతున్నారు. తప్పుడు ఆహారాలు, శరీరానికి సహకరించని ఆహారాల వల్ల జీర్ణ రుగ్మతలు సంభవించవచ్చు. అలా కాకుండా ఉండాలంటే రాగి సీసాలోని నీటిని తాగవచ్చు.

శరీరంలో వ్యాధికి కారణమయ్యే ఇన్ఫెక్షన్లను నివారించడానికి రాగి బాటిల్‌లో నీటిని తాగమని ఆరోగ్ నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. కాపర్ వాటర్ బాటిల్‌లో నీటిని తాగడం వల్ల శరీరానికి రాగి పోషకాలు లభిస్తాయని అంటున్నారు. సరైన మోతాదులో కాపర్ శరీరానికి అందకపోవడం వల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరు దెబ్బతింటుంది. తద్వారా హైపోథైరాయిడిజం, హైపర్‌థైరాయిడిజం..బారిన పడే అవకాశముంది. అలాంటి పరిస్థితుల్లో శరీరంలో కాపర్‌లేమిని పూరించాలంటే రాగి పాత్రల్లో నిల్వ చేసిన నీటిని తాగడం అలవాటు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. గౌట్ సమస్యలు రాకుండా ఉండాలంటే రాగి సీసాలో నీళ్లు తాగవచ్చు. రాగి పాత్రల్లో నిల్వ ఉంచిన నీరు తాగటం వల్ల ఒంటి నొప్పులను కూడా నయం చేస్తుందని చెబుతారు.

ఇవి కూడా చదవండి

ఒక రోజు రాత్రంతా రాగి పాత్రల్లో నిల్వ చేసిన నీటిని ఉదయాన్నే తాగితే.. ఈజీగా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. రాగి పాత్రల్లో నిల్వచేసిన నీటితో శరీరంలోని కొవ్వును కరిగించే గుణాలు ఉంటాయి. తద్వారా అధిక బరువును తగ్గించుకోవడంతో పాటు అధిక బరువు వల్ల వచ్చే ఇతర ఆరోగ్య సమస్యల నుంచి కూడా దూరంగా ఉండొచ్చు. కాపర్‌ బాటిల్‌లో నీటిని తాగడం వల్ల క్యాన్సర్‌ సమస్యను దూరం చేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. రాగిలోని బలమైన యాంటీఆక్సిడెంట్ గుణాలు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. తద్వారా క్యాన్సర్ కణాలు పెరగకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో రాగి పాత్రల్లో రాత్రంతా నిల్వ చేసిన నీటిని తాగటం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. పొట్టలో ఏర్పడిన అల్సర్లు కూడా తగ్గుముఖం పట్టడంతో పాటు జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. రోజూ రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీరు తాగడం వల్ల కాలేయం, మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది. రాగి నీటిలో వుండే బ్యాక్టీరియాలను నాశనం చేస్తుంది. నీటి ద్వారా వ్యాపించే డయేరియా, జాండీస్ వంటి వ్యాధులు రాకుండా చేస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..