Relationship: మీకు బ్రేకప్ అయ్యిందా.. అయితే వెంటనే ఈ తప్పు అస్సలు చేయకండి!
ఈ రోజుల్లో ప్రేమలో పడటం, నచ్చకపోతే ఆ వెంటనే విడిపోవడం కామన్ గా మారింది. అంతేకాదు.. బ్రేకప్ అంటూ పార్టీలు చేసుకుంటున్నారు. అయితే బ్రేకప్ అయిన తర్వాత మునుపటిలా ఉండటం అంత ఈజీ కాదు. రోజు మాట్లాడే వ్యక్తి దూరమైతే పరిస్థితి మరింత దిగజారిపోతుంది.

ఈ రోజుల్లో ప్రేమలో పడటం, నచ్చకపోతే ఆ వెంటనే విడిపోవడం కామన్ గా మారింది. అంతేకాదు.. బ్రేకప్ అంటూ పార్టీలు చేసుకుంటున్నారు. అయితే బ్రేకప్ అయిన తర్వాత మునుపటిలా ఉండటం అంత ఈజీ కాదు. రోజు మాట్లాడే వ్యక్తి దూరమైతే పరిస్థితి మరింత దిగజారిపోతుంది. ఒక్కసారిగా ఏం చేయాలో అర్ధం కాదు. ఒంటరితనంతో ఇబ్బంది పడుతుంటే కచ్చితంగా కొన్ని సలహాలు, సూచనలు తీసుకోవాల్సి ఉంటుంది. అవి ఏమిటంటే..
వ్యక్తులను పోల్చడం ఎల్లప్పుడూ అసంతృప్తికి దారి తీస్తుంది. ప్రతి ఒక్కరూ ప్రతిదానిలో ది బెస్ట్ గా ఉండలేరని గుర్తుంచుకోండి. కాబట్టి మీతో మీరు సంతోషంగా ఉండటానికి ప్రయత్నించండి. నెగిటివ్ విషయాలను పక్కన పెట్టిన నచ్చిన విషయాలపై ద్రుష్టి పెట్టాలి. ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదని గుర్తించుకోవాలి. ఒంటరితనాన్ని భర్తీ చేయడానికి మీకు మరెవరూ అవసరం లేదని నిర్ణయించుకోవడానికి ప్రయత్నించండి. సోలో ట్రిప్‌కు వెళ్లడం కూడా మీ మానసిక ఆరోగ్యానికి చాలా మంచిది. సోషల్ మీడియాకు దూరంగా ఉండంటి. ఒత్తిడితో ఉండే వాళ్లతో వీలైనంత వరకు దూరంగా ఉంటే ఇంకా మంచిది. సోషల్ మీడియా నుండి చిన్న విరామం తీసుకోవడం వల్ల ఇతర విషయాలపై ఫోకస్ చేయొచ్చు.
ప్రతిరోజూ ఒకే జీవితాన్ని గడిపితే బోర్ కొడుతుంది. కాబట్టి కళాశాల లేదా కార్యాలయానికి వెళితే, వివిధ మార్గాల్లో వెళ్లేందుకు ప్రయత్నించండి. ఇక భిన్నంగా ఏదైనా చేయడానికి ప్రయత్నించాలి. మనుషుల గురించి ఆలోచించడం వల్ల దుఃఖం, ఇబ్బంది కలుగుతాయి. అటువంటి పరిస్థితిలో గతాన్ని మరచిపోవడాన్ని అలవాటు చేసుకోండి. అయితే ఎప్పుడు ఒంటరిగా ఉండకుండా క్లోజ్ గా ఉండే ఫ్రెండ్ తో ఉంటే సంతోషంగా ఉండగలుగుతారు. ఇక కొత్త పరిచయాలు కూడా మీలో కొత్త శక్తినిస్తాయి. కాబట్టి గతంకంటే ఏదైనా భిన్నంగా చేయగలిగితే త్వరగా సమస్య నుంచి బయటపడొచ్చు.