AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hair Care Tips: జుట్టుకు షాంపూ అప్లై చేయడానికి 5 నిమిషాల ముందు ఇలా చేయండి.. అందంగా మారిపోతుంది..!

ప్రతి ఒక్కరూ తమ జుట్టు అందంగా, నల్లగా, ఒత్తుగా ఉండాలని కోరుకుంటారు. ప్రతి మనిషి శారీరక సౌందర్యంలో జుట్టు కీలక పాత్ర పోషిస్తుంది. పురుషులు లేదా మహిళలు ఎవరైనా సరే, ప్రతి ఒక్కరూ తమ జుట్టు ఒత్తుగా, నల్లగా, మెరిసేలా, చక్కగా స్టైల్‌గా ఉండాలని కోరుకుంటారు. ఆరోగ్యకరమైన, అందమైన జుట్టు వ్యక్తి విశ్వాసాన్ని పెంచుతుంది, వారిని ఆకర్షణీయంగా చేస్తుంది. ప్రస్తుత కాలంలో ఫ్యాషన్ పరిశ్రమలో కూడా, అందమైన జుట్టుకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. బాలీవుడ్ సెలబ్రిటీలు, మోడల్స్ జుట్టు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.

Hair Care Tips: జుట్టుకు షాంపూ అప్లై చేయడానికి 5 నిమిషాల ముందు ఇలా చేయండి.. అందంగా మారిపోతుంది..!
Hair Care Tips
Shiva Prajapati
| Edited By: |

Updated on: Sep 24, 2023 | 7:30 PM

Share

ప్రతి ఒక్కరూ తమ జుట్టు అందంగా, నల్లగా, ఒత్తుగా ఉండాలని కోరుకుంటారు. ప్రతి మనిషి శారీరక సౌందర్యంలో జుట్టు కీలక పాత్ర పోషిస్తుంది. పురుషులు లేదా మహిళలు ఎవరైనా సరే, ప్రతి ఒక్కరూ తమ జుట్టు ఒత్తుగా, నల్లగా, మెరిసేలా, చక్కగా స్టైల్‌గా ఉండాలని కోరుకుంటారు. ఆరోగ్యకరమైన, అందమైన జుట్టు వ్యక్తి విశ్వాసాన్ని పెంచుతుంది, వారిని ఆకర్షణీయంగా చేస్తుంది. ప్రస్తుత కాలంలో ఫ్యాషన్ పరిశ్రమలో కూడా, అందమైన జుట్టుకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. బాలీవుడ్ సెలబ్రిటీలు, మోడల్స్ జుట్టు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. సామాన్యులు కూడా వారి నుండి స్ఫూర్తిని పొంది తమ జుట్టును ఆరోగ్యంగా, ఆకర్షణీయంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇందుకోసం ఖరీదైన సెలూన్లకు వెళ్లి జుట్టు సంరక్షణ కోసం ఖరీదైన ఉత్పత్తులను వాడుతుంటారు. అయితే మీ జుట్టును అందంగా మార్చుకోవడానికి ఖర్చు లేని సింపుల్ చిట్కాలను మీ ముందుకు తీసుకువచ్చాం. జుట్టుకు షాంపు వినియోగించే ముందు.. ఈ చిట్కాను పాటిస్తే.. జుట్టు అందంగా, మెరిసేలా ఉంటుంది. మరి ఆ టిప్స్ ఏంటో ఓసారి చూద్దాం.

షాంపై అప్లై చేయడానికి ముందు జుట్టు దువ్వుకోవాలి..

షాంపూ అప్లై చేయడానికి ముందు మీ జుట్టును దువ్వుకోవాలి. జుట్టులో ఎలాంటి చిక్కులు లేకుండా చూసుకొవాలి. తద్వారా షాంపూ జుట్టుకు సరిగా అప్లై అవుతుంది. వెడల్పాటి పంటి దువ్వెనతో జుట్టును బాగా దువ్వండి. ఇది షాంపూ చేసేటప్పుడు జుట్టు చిట్లడం తగ్గిస్తుంది.

షాంపూ కంటే ముందు నూనెతో మర్దన..

జుట్టుకు షాంపూ పెట్టే ముందు.. నేను బాగా పట్టించి మర్దన చేయాలి. దీని కారణంగా జుట్టు ఉపరితం సహజ నూనె పొర ఏర్పడుతుంది. ఇది జుట్టుకు తేమను అందిస్తుంద. ఇది షాంపూ, ఏదైనా హానికరమైన ప్రభావాల నుండి రక్షిస్తుంది. షాంపూ చేయడానికి ముందు, కొబ్బరి లేదా ఆలివ్ నూనెతో జుట్టును బాగా మసాజ్ చేయండి. దీంతో షాంపూతో తలస్నానం చేసినా జుట్టు మృదువుగా, మెరుస్తూ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

షాంపూని సరైన పరిమాణంలో వాడాలి..

జుట్టుకు సరైన పరిమాణంలో షాంపూని ఉపయోగించాలి. ఎక్కువ మొత్తంలో షాంపూ అప్లై చేయడం వల్ల జుట్టు బలహీనపడుతుంది. షాంపూని ఉపయోగించినప్పుడు.. వృత్తాకార కదలికలో తలపై అప్లై చేయండి. తద్వారా జుట్టు ఎక్కువగా చిక్కుకుపోకుండా ఉంటుంది.

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ప్రజల సాధారణ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ఈ సూచనలు పాటించే ముందు.. నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవడం ఉత్తమం. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..