Gas Stove: ఈ లిక్విడ్ ఒక్కసారి స్ప్రే చేస్తే.. స్టౌవ్ వెనుక టైల్స్‌కి జిడ్డు జన్మలో పట్టదు..
వంటగదిలో స్టవ్ వెనుక టైల్స్ జిడ్డు పట్టకుండా చూసేందుకు సులభమైన చిట్కా. వంట చేయడానికి ముందు టైల్స్‌పై ప్రత్యేకంగా తయారు చేసిన లిక్విడ్‌ను స్ప్రే చేయాలి. వంట పూర్తయిన తర్వాత, టైల్స్ వేడిగా ఉన్నప్పుడు తడి వస్త్రంతో తుడిస్తే జిడ్డు సులువుగా తొలగిపోతుంది, శుభ్రంగా ఉంటుంది.

వంటగదిలో స్టవ్ వెనుక ఉండే టైల్స్‌పై జిడ్డు పేరుకుపోవడం అనేది మహిళలు తరచుగా ఎదుర్కొనే ప్రధాన సమస్య. అయితే, జిడ్డు పట్టిన తర్వాత కష్టపడి రుద్దడం కంటే, అది అంటుకోకుండా ముందుగానే జాగ్రత్త పడటం సులభం. అందుకోసమే ఈ అద్భుతమైన చిట్కా. ముందుగా ఒక క్లీనింగ్ లిక్విడ్‌ను సిద్ధం చేసుకోవాలి. దీని కోసం నీటిలో ఒక స్పూన్ సర్ఫ్ గానీ, ఏదైనా షాంపూ గానీ లేదా డిష్ వాషర్ లిక్విడ్‌ను గానీ కలిపి ఒక స్ప్రే బాటిల్‌లో పోసుకోవాలి. వంట ప్రారంభించే ముందే స్టవ్ వెనుక ఉన్న టైల్స్‌పై ఈ మిశ్రమాన్ని పై నుంచి కిందకు స్ప్రే చేయాలి.
ఇది చదవండి: మిగిలిపోయిన సబ్బులతో ఇన్ని ఉపయోగాలా.? ఇది చూస్తే ఇంకెప్పుడూ పడెయ్యరు..
ఇలా చేయడం వల్ల టైల్స్‌పై ఒక పలుచని రక్షణ పొర ఏర్పడుతుంది. వంట చేసేటప్పుడు ఎగిరిపడే నూనె జిడ్డు నేరుగా టైల్స్‌కు అంటుకోకుండా ఈ లిక్విడ్ పొరపైనే ఆగిపోతుంది. వంట పూర్తయిన వెంటనే, టైల్స్ ఇంకా వేడిగా ఉన్నప్పుడే ఒక తడి గుడ్డతో తుడవాలి. స్టవ్ వేడికి టైల్స్ కూడా వేడెక్కుతాయి కాబట్టి, ఆ సమయంలో జిడ్డు చాలా సులభంగా వదిలిపోతుంది. ఒకసారి తడి గుడ్డతో తుడిచి, ఆపై గుడ్డను కడిగి మరోసారి శుభ్రం చేస్తే టైల్స్ కొత్తవాటిలా మెరుస్తాయి. ఇదే స్ప్రేని స్టవ్‌ను శుభ్రం చేయడానికి కూడా వాడుకోవచ్చు. ఈ చిన్న చిట్కాను రోజూ పాటించడం వల్ల వంటగది ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంటుంది.
ఇది చదవండి: గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా రిపేర్ చేసుకోవచ్చు..
