AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శరీరంలోని కొవ్వును కోసి పడేస్తాయ్.. హలీమ్ గింజల సీక్రెట్ తెలిస్తే వదలరు..

హలీమ్ సీడ్స్ (గార్డెన్ క్రెస్) లో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. ఇవి అధిక ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఐరన్ వంటి ఖనిజాలను అందిస్తాయి. రక్తహీనత, జీర్ణ సమస్యలు, గుండె ఆరోగ్యం, బరువు నియంత్రణ, మధుమేహం నిర్వహణ వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలకు తోడ్పడతాయి. సరైన మోతాదులో, పద్ధతిలో తీసుకుంటే అద్భుత ఫలితాలు పొందవచ్చు.

శరీరంలోని కొవ్వును కోసి పడేస్తాయ్.. హలీమ్ గింజల సీక్రెట్ తెలిస్తే వదలరు..
Halim Seeds
Shaik Madar Saheb
|

Updated on: Apr 30, 2026 | 1:51 PM

Share

నేటి ఆధునిక జీవనశైలిలో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించడం అత్యవసరం. ఇందులో భాగంగా కొన్ని సూపర్ ఫుడ్స్ గురించి తెలుసుకోవడం ఎంతో ప్రయోజనకరం. బరువు తగ్గాలనుకున్న వారికి కొన్ని గింజలు అమృతంలా పనిచేస్తాయి. అలాంటి వాటిలో హలీమ్ సీడ్స్ ఒకటి.. గార్డెన్ క్రెస్ సీడ్స్ (హలీమ్ సీడ్స్).. అటువంటి కోవకే చెందుతాయి. హలీమ్ సీడ్స్ అద్భుతమైన పోషక విలువలు కలిగి ఉండి, అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపుతాయని.. వీటిని రెగ్యులర్ గా తీసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు..

గార్డెన్ క్రెస్ సీడ్స్ (హలీమ్ సీడ్స్/ఆడాలు):

వీటిని తెలుగులో ఆడాలు అని కూడా అంటారు. నువ్వుల గింజల వలె చిన్నగా, ఎరుపు రంగు లేదా బ్రౌన్ రంగులో ఉంటాయి. నువ్వుల కంటే ఎక్కువ పోషక విలువలను కలిగి ఉంటాయి.

హలీమ్ సీడ్స్ పోషక విలువలు:

శక్తి: 100 గ్రాములకు సుమారు 435 కిలో క్యాలరీలు.

ప్రోటీన్: 100 గ్రాములకు కనీసం 25 గ్రాములు.

ఆరోగ్యకరమైన కొవ్వులు: 25-30 గ్రాములు, ఇందులో 40% వరకు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ (ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్), 20-30% మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ (MUFA) ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మంచివి.

ఫైబర్: 10 గ్రాముల వరకు ఫైబర్ ఉంటుంది.

ఖనిజాలు: 100 గ్రాములకు 100 మిల్లీగ్రాముల ఐరన్ లభిస్తుంది. అలాగే, 1200 మిల్లీగ్రాముల పొటాషియం, 800 మిల్లీగ్రాముల ఫాస్ఫరస్, అధిక కాల్షియం, మెగ్నీషియం, జింక్ కూడా ఉంటాయి.

హలీమ్ సీడ్స్ ఆరోగ్య ప్రయోజనాలు:

రక్తహీనత నివారణ: ఐరన్ అధికంగా ఉండటం వలన రక్తహీనతను నివారించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా యువతులు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, మెనోపాజ్ దశలో ఉన్న మహిళలకు ఇది చాలా అవసరం.

గుండె ఆరోగ్యం: ఒమేగా-3, MUFA ఫ్యాటీ యాసిడ్స్ గుండె పనితీరును మెరుగుపరుస్తాయి.

రక్తపోటు నియంత్రణ: అధిక పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

మధుమేహం నిర్వహణ: వీటిలోని ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో తోడ్పడుతుంది.

జీర్ణక్రియ – మలబద్ధకం: ఫైబర్ మలబద్ధకాన్ని నివారించి, జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.

లాక్టోగోగ్: పాలిచ్చే తల్లులలో పాల ఉత్పత్తిని పెంచడానికి సహాయపడతాయి.

యాంటీఆక్సిడెంట్స్: యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, పాలిఫెనోలిక్ సమ్మేళనాలు ఉండటం వల్ల క్యాన్సర్ నిరోధకంగా, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తాయి.

వృద్ధులకు: వృద్ధులలో ఐరన్ మరియు ఇతర ఖనిజాల లోపాన్ని నివారించడంలో తోడ్పడతాయి.

హలీమ్ సీడ్స్ ఎలా తీసుకోవాలి:

హలీమ్ సీడ్స్ ను  రాత్రి నీటిలో నానబెట్టి ఉదయాన్నే తాగడం చాలా మంచిది.. ఇంకా వీటిని మజ్జిగలో, నిమ్మకాయ నీళ్ళలో కలుపుకొని తాగవచ్చు. గోంద్ లడ్డు, చట్నీలు, స్నాక్స్‌లోనూ ఉపయోగించవచ్చు. మహారాష్ట్ర, తెలంగాణలో వీటితో రకరకాల వంటకాలు చేస్తుంటారు.

జాగ్రత్తలు: ప్రెగ్నెంట్ లేడీస్, రక్తం పలచబడే మందులు వాడేవారు, హైపోటెన్షన్ ఉన్నవారు, అలర్జీలు ఉన్నవారు వీటిని తీసుకోకూడదు.

సమగ్రంగా చూస్తే, గార్డెన్ క్రెస్ (హలీమ్) అద్భుతమైన పోషక ప్రయోజనాలను అందిస్తుంది. వీటిని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు.. మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us