AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దూసుకొచ్చిన మృత్యువు.. కళ్లు మూసి తెరిచేలోగా దారుణం.. గుండె ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి..

మిర్యాలగూడ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అద్దంకి-నార్కెట్‌పల్లి రోడ్డుపై అతివేగంతో దూసుకొచ్చిన కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మైసమ్మకుంట తండాకు చెందిన మెగావత్‌ మంత మరణించారు. స్థానికులు అధికారుల నిర్లక్ష్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

దూసుకొచ్చిన మృత్యువు.. కళ్లు మూసి తెరిచేలోగా దారుణం.. గుండె ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి..
Road Accident
Shaik Madar Saheb
|

Updated on: Apr 30, 2026 | 3:51 PM

Share

కళ్లు మూసి తెరిచేలోగా రోడ్లపై ఎలాంటి దారుణాలు జరుగుతాయో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. మృత్యువేగంతో దూసుకొచ్చిన కారు ఎలాంటి బీభత్సం సృష్టించిందో తెలుసుకుంటే ఒక్కసారిగా షాక్‌ అవుతారు. అవును.. వాయు వేగంతో దూసుకొచ్చిన కారు.. బీభత్సం సృష్టించింది.. ఈ ప్రమాదకర ఘోర రోడ్డు ప్రమాదం మిర్యాలగూడ శివారులో జరిగింది. అతివేగంతో వచ్చిన కారు బీభత్సం సృష్టించింది. అద్దంకి-నార్కెట్‌పల్లి రోడ్డుపై నందిపాడు బైపాస్‌ దగ్గర ఈ ఘోరం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ముందుగా బైక్‌ నడుపుతూ రోడ్డు దాటుతున్న వ్యక్తిని, రోడ్డుపక్కన నిలబడిన వ్యక్తిని ఢీకొంది కారు. ఆ తర్వాత రోడ్డుకు అవతలి పక్కనున్న ట్రాక్టర్ మీదకు కారు దూసుకుపోయింది. ఆ ట్రాక్టర్‌‌ దగ్గరన్న ఇద్దరు వ్యక్తులను కారు ఢీకొన్నది. ట్రాక్టర్‌ దగ్గరున్న ఇద్దరు వ్యక్తులు ఆ కారు స్పీడుకు ఎగిరిపడ్డారు. వారిలో ఒకరు చనిపోయారు. చనిపోయిన వ్యక్తిని మైసమ్మకుంట తండాకు చెందిన మెగావత్‌ మంతగా గుర్తించారు. ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

వీడియో చూడండి..

అయితే.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కళ్ల ముందున్న వ్యక్తులు రోడ్డు ప్రమాదానికి గురికావడం చూసి.. అందరూ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.. ఈ ప్రమాదం స్థానికులు చర్యలు తీసుకోవాలంటూ రోడ్డుపై బైఠాయించారు.. అద్దంకి-నార్కెట్‌పల్లి రహదారిపై వరుసగా జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. స్థానికుల రాస్తారోకోతో అద్దంకి-నార్కెట్‌పల్లి రహదారిపై వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని,స్థానికులతో చర్చలు జరిపి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
గణేష్ పండుగకు ఈ స్పెషల్ స్వీట్ తప్పక ట్రై చేయండి..
గణేష్ పండుగకు ఈ స్పెషల్ స్వీట్ తప్పక ట్రై చేయండి..
ఉదయం లేవగానే పొట్ట ఉబ్బరంగా ఉందా? రాత్రి ఈ మిస్టేక్ చేయకండి
ఉదయం లేవగానే పొట్ట ఉబ్బరంగా ఉందా? రాత్రి ఈ మిస్టేక్ చేయకండి
బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేదు.. ఇక ATM నుంచే కొత్త డెబిట్ కార్డు
బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేదు.. ఇక ATM నుంచే కొత్త డెబిట్ కార్డు
ఆన్‌లైన్‌లో టీవీ డివైజ్ ఆర్డర్ చేస్తే.. ఇంటికి వచ్చిన పార్శిల్‌లో
ఆన్‌లైన్‌లో టీవీ డివైజ్ ఆర్డర్ చేస్తే.. ఇంటికి వచ్చిన పార్శిల్‌లో
కుమారుడి ఫస్ట్ బర్త్‌ డే.. వాయువ్ తేజ్ ఫేస్ రివీల్ చేసిన వరుణ్
కుమారుడి ఫస్ట్ బర్త్‌ డే.. వాయువ్ తేజ్ ఫేస్ రివీల్ చేసిన వరుణ్
దంచి కొడుతోన్న బంగ్లా.. వికెట్ల కోసం హర్మన్ సేన పోరాటం..!
దంచి కొడుతోన్న బంగ్లా.. వికెట్ల కోసం హర్మన్ సేన పోరాటం..!
చెత్త కుప్పలో నుంచి పసిబిడ్డ ఏడుపులు... ఏంటా అని వెళ్ళి చూడగా...
చెత్త కుప్పలో నుంచి పసిబిడ్డ ఏడుపులు... ఏంటా అని వెళ్ళి చూడగా...
గేమింగ్ సంస్థ అధిపతికి షాక్..భార్యకు రూ.18 వేల కోట్ల భరణం!
గేమింగ్ సంస్థ అధిపతికి షాక్..భార్యకు రూ.18 వేల కోట్ల భరణం!
పుతిన్, షీ జిన్‌పింగ్‌ బ్రిక్స్ షెడ్యూల్ ఇదే!
పుతిన్, షీ జిన్‌పింగ్‌ బ్రిక్స్ షెడ్యూల్ ఇదే!
ఇలా చేస్తే ఆఫీస్ స్ట్రెస్ నుంచి వెంటనే రిలీఫ్.. !
ఇలా చేస్తే ఆఫీస్ స్ట్రెస్ నుంచి వెంటనే రిలీఫ్.. !