AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APOSS SSC and Inter Results 2026: ఓపెన్‌ పదో తరగతి, ఇంటర్ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు 2026 విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు గురువారం ఉదయం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ సార్వత్రిక విద్యాపీఠం (ఏ.పి.ఓ.ఎస్.ఎస్) పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు (మార్చి 2026) ఫలితాలు కూడా విడుదలయ్యాయి. ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ లో తమ హాల్‌ టికెట్‌ నంబర్‌ నమోదు..

APOSS SSC and Inter Results 2026: ఓపెన్‌ పదో తరగతి, ఇంటర్ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు 2026 విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే
APOSS SSC and Inter Results
Srilakshmi C
|

Updated on: Apr 30, 2026 | 3:44 PM

Share

అమరావతి, ఏప్రిల్‌ 30: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు గురువారం ఉదయం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ సార్వత్రిక విద్యాపీఠం (ఏ.పి.ఓ.ఎస్.ఎస్) పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు (మార్చి 2026) ఫలితాలు కూడా విడుదలయ్యాయి. ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ లో తమ హాల్‌ టికెట్‌ నంబర్‌ నమోదు చేసి రిజల్ట్స్ చెక్‌ చేసుకోవచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి మన మిత్ర వాట్సప్‌ గ్రూప్‌, డిజిలాకర్‌ నుంచి కూడా ఫలితాలను పొందొచ్చు.

ఏపీ ఓపెన్‌ పదో తరగతి, ఇంటర్ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు 2026 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కాగా రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి, ఇంటర్మీడియట్‌ ఓపెన్ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 16, 2026వ తేదీ నుంచి మార్చి 28, 2026వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరిగాయి. పదో తరగతి పరీక్షలకు మొత్తం 24,949 మంది హాజరుకాగా ఇందులో 6,277 మంది (25.12 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్మీడియట్‌ పరీక్షలు 55,048 మంది హాజరుకాగా.. ఇందులో 23,755 మంది (43.15 శాతం) ఉత్తీర్ణత సాధించారు. పదో తరగతిలో కోనసీమ జిల్లా 83.07 శాతం అత్యధికంగా ఉత్తీర్ణత సాధించగా.. బాపట్ల 01.03 శాతం అత్యంత తక్కువగా ఉత్తీర్ణత నమోదైంది.

ఇవి కూడా చదవండి

ఇక APOSS మే నెలలో మరోమారు ఫెయిలైన విద్యార్ధుల కోసం పరీక్షలు నిర్వహించనుంది. ఈ పరీక్షలు మే 25, 2026వ తేదీ నుంచి జూన్ 1, 2026వ తేదీ వరకు జరుగుతాయి. ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు జూన్ 2, 2026 నుంచి జూన్ 6, 2026వ తేదీ వరకు జరుగుతాయి. ఈ పరీక్షలకు ఫీజు మే 2, 2026వ తేదీ నుంచి మే 11, 2026వ తేదీ వరకు చెల్లించవచ్చు. ఇతర వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us