AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజయోగాలు, ధన యోగాలు.. వారి మనసులోని కోరికలు తీరడం ఖాయం!

Telugu Astrology: బుధుడు, శుక్రుడు, గురువు వరుసలో సంచారం చేయడం వల్ల మే మధ్య వరకు కొన్ని రాశుల వారికి శుభయోగాలు కలగనున్నాయి. ముఖ్యంగా మేషం, సింహం, తుల, ధనుస్సు, కుంభం, మీన రాశుల వారు కోరికలు నెరవేర్చుకోవడంతో పాటు ధన, రాజయోగాల లాభాలు పొందే అవకాశం ఉంది.

రాజయోగాలు, ధన యోగాలు.. వారి మనసులోని కోరికలు తీరడం ఖాయం!
Dhana Yoga And Raja Yoga
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 30, 2026 | 3:36 PM

Share

జ్యోతిషశాస్త్రం ప్రకారం శుభ గ్రహాలు ఒక వరుసలో సంచారం చేయడం వల్ల శుభవార్తలు ఎక్కువగా వినడం, శుభ పరిణామాలు ఎక్కువగా చోటు చేసుకోవడం జరుగుతుంది. ఈ నెల 30 నుంచి మేషంలో బుధుడు, వృషభంలో శుక్రుడు, మిథునంలో గురువు వరుసలో సంచారం చేస్తున్నందువల్ల ఆరు రాశుల వారి జీవితాల్లో ఇక నుంచి తప్పకుండా కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. రాజయోగాలు, ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. మేషం, సింహం, తుల, ధనుస్సు, కుంభం, మీన రాశుల వారికి మే మధ్య వరకు ఈ శుభ యోగం కొనసాగుతుంది.

  1. మేషం: మూడు శుభ గ్రహాలు వరుసగా మూడు రాశుల్లో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి ఏ ప్రయత్నమైనా సునాయాసంగా నెరవేరుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్థిక లాభాలు చేకూరుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆర్థిక ప్రయత్నాలు, అదనపు ఆదాయ ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. రాజయోగాలు, ధన యోగాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికార యోగం పడుతుంది. వ్యాపారాల్లో దాదాపు కనక వర్షం కురిసే అవకాశం ఉంది.
  2. సింహం: ఈ రాశికి శుభ గ్రహాల అనుకూల సంచారం వల్ల ఈ రాశివారికి రాజపూజ్యాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరగడంతో పాటు, ఆర్థికంగా కూడా అనేక లాభాలు, ప్రయోజనాలు చేకూరుతాయి. ఏ రంగంలో ఉన్నవారికైనా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలపరంగా శుభవార్తలు వింటారు. ఆర్థిక, కుటుంబ వ్యవహారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి.
  3. తుల: ఈ రాశికి గురు, శుక్ర, బుధుల అనుకూల సంచారం వల్ల ఈ రాశివారికి తప్పకుండా ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. శుభవార్తలు ఎక్కువగా వింటారు. కలలో కూడా ఊహించని అదృష్టాలు కలుగుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో విదేశాల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. విదేశీ సొమ్ము అనుభవించే యోగం ఉంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. శక్తి సామర్థ్యాలు వెలుగు చూస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం పెరుగుతుంది.
  4. ధనుస్సు: ఈ రాశికి పంచమ, షష్ట, సప్తమ స్థానాల్లో శుభ గ్రహాల సంచారం వల్ల అధికార యోగం పడుతుంది. జీవితం కొన్ని సానుకూల మలుపులు తిరుగుతుంది. నిరుద్యోగులు, ఉద్యోగులకు ఊహిం చని కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక సమస్యలు, పోటీదార్ల సమస్యలు, అనారోగ్యాలు తగ్గి, జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు.
  5. కుంభం: ఈ రాశివారికి మూడు ప్రధాన శుభ గ్రహాల అనుకూలత వల్ల మూడు, నాలుగు స్థానాలు మరింతగా బలపడి, విపరీత రాజయోగం ఏర్పడుతోంది. వృత్తి, ఉద్యోగాల్లో అందలాలు ఎక్కడంతో పాటు, ఆర్థికంగా, సామాజికంగా శుభ యోగాలు పట్టే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు చక్కబడడం, ఆస్తి విలువ పెరగడం, ఆస్తి కలిసి రావడం వంటివి జరుగుతాయి. అతి తక్కువ వ్యవధిలో సంపన్నులయ్యే అవకాశం ఉంది. గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి.
  6. మీనం: ఈ రాశివారికి ధన, తృతీయ, చతుర్థ స్థానాల్లో శుభ గ్రహాల సంచారం వల్ల ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆర్థిక ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. అదనపు ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం కావడంతో పాటు, ఇతరులకు ఇతోధికంగా సహాయం చేయడం కూడా జరుగుతుంది. ఆశించిన శుభవార్తలు వింటారు.

(నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు)

Follow Us