AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Alert: చల్లని కబురు మావ.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్

తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి ఎండలు ఠారెత్తిస్తున్న వేళ, వాతావరణ శాఖ ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రాగల మూడు రోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన జల్లులు ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

Weather Alert: చల్లని కబురు మావ.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
Telangana Andhra Pradesh Weather Update
Shaik Madar Saheb
|

Updated on: Apr 30, 2026 | 3:23 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి.. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం వేడి, ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. దాదాపు అన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ద్రోణి ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. ద్రోణి/ గాలులు అంతరాయం ఈరోజు దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో విస్తరించి ఉంది.

వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి.

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం :-

గురువారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురు గాలులు గంటకు 50 – 60 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

శుక్రవారం, శనివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురు గాలులు గంటకు 40 – 50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్:-

గురువారం, శుక్రవారం, శనివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.

రాయలసీమ :-

గురువారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురు గాలులు గంటకు 40 – 50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

శుక్రవారం, శనివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురు గాలులు గంటకు 30 – 40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

గమనిక :- కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం – రాయలసీమలో రాగల 7 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు లేదు

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ – వాతావరణ హెచ్చరికలు :

హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. నిన్నటి ద్రోణి/వాయు అస్థిరత ఇప్పుడు దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో విస్తరించి ఉంది. అంతర్గత మహారాష్ట్ర – దానిని ఆనుకుని ఉన్న తెలంగాణపై సముద్ర మట్టానికి 3.1 కి.మీ. ఎత్తులో ఒక ప్రతిచక్రవాత వలయం ఏర్పడింది.

తెలంగాణ రాష్ట్రంలో రాగల 3 రోజులకు వాతావరణ సూచన: (Weather Forecast):

తెలంగాణ రాష్ట్రంలో గురువారం, శుక్రవారం, శనివారం కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో రానున్న మూడు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఇంచుమించు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉంది.

వాతావరణ హెచ్చరికలు (weather warnings):

ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30-40 కి.మీ)తో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us