AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Okra: ఇలా కట్ చేస్తే బెండకాయ ముక్కలకు అస్సలు జిగురు ఉండదు.. సింపుల్ చిట్కా..

బెండకాయలను కోసేటప్పుడు జిగురు సమస్య వేధిస్తుందా? ఈ సులభమైన చిట్కాను ప్రయత్నించండి. బెండకాయలు తరిగే ముందు, చాకుకి నిమ్మకాయ చెక్కను రుద్దండి లేదా ఒక నిమ్మకాయను ఆ చాకుతో కోయండి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి స్టోరీ చూసేయండి.

Okra: ఇలా కట్ చేస్తే బెండకాయ ముక్కలకు అస్సలు జిగురు ఉండదు.. సింపుల్ చిట్కా..
Okra
Ravi Kiran
|

Updated on: Apr 09, 2026 | 8:29 PM

Share

బెండకాయలను తరిగేటప్పుడు, వండేటప్పుడు ఎదురయ్యే జిగురు సమస్యను నివారించడానికి, అలాగే దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ తెలుసుకోండి. బెండకాయలో పీచు పదార్థం(ఫైబర్) పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. మలబద్ధకం సమస్య తగ్గుతుంది. ఇందులో ఉండే విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా, కంటి చూపును మెరుగుపరచడంలో కూడా తోడ్పడతాయి. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి బెండకాయ ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఇందులోని ఫోలేట్ గర్భిణీ స్త్రీలకు, గర్భస్థ శిశువు ఆరోగ్యానికి చాలా అవసరం.

ఇది చదవండి: ఒక్క టూత్‌పిక్ చాలు.. వేళ్లకు నొప్పి లేకుండా వెల్లుల్లి పొట్టును ఈజీగా వలవొచ్చు..

జిగురు పోవడానికి చిట్కా:

బెండకాయలను కోసేటప్పుడు జిగురు చాకుకు అంటుకోకుండా ఉండటానికి ఒక సులభమైన మార్గం ఉంది. బెండకాయలు తరగడానికి ముందు, మీరు వాడే చాకుకు నిమ్మకాయ చెక్కతో బాగా రుద్దాలి లేదా ఒక నిమ్మకాయను అదే చాకుతో కోయాలి. నిమ్మరసంలోని సిట్రిక్ ఆమ్లం బెండకాయ జిగురుతో చర్య జరిపి, అది చాకుకు లేదా చేతులకు అంటుకోకుండా చేస్తుంది. ఈ చిన్న చిట్కాను పాటించడం వల్ల బెండకాయ ముక్కలు ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా వస్తాయి. వంట చేసేటప్పుడు కూడా కూర జిగురుగా మారకుండా పొడిపొడిగా, రుచిగా ఉంటుంది. ఇది వంట పనిని సులభతరం చేయడమే కాకుండా సమయాన్ని కూడా ఆదా చేస్తుంది.

ఇది చదవండి: పాల మీగడతో అసలైన ఆవు నెయ్యిను ఈజీగా ఎలా తయారు చేయొచ్చో తెల్సా..

Follow Us