మా సార్ చాలా మంచివాడు.. మాకు అతనే కావాలి.. బోరున విలపించిన విద్యార్థులు!
మా సార్ చాలా మంచివాడు..మాకు అతనే కావాలి..కొందరు కావాలని తప్పుడు పిర్యాదులు చేశారని.. గిరిజన ఆశ్రమ స్కూల్ విద్యార్థులు కన్నీటి పర్యంతం అయ్యారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ స్కూల్లో బుధవారం(ఏప్రిల్ 08) ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ రాహుల్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.

మా సార్ చాలా మంచివాడు..మాకు అతనే కావాలి..కొందరు కావాలని తప్పుడు పిర్యాదులు చేశారని.. గిరిజన ఆశ్రమ స్కూల్ విద్యార్థులు కన్నీటి పర్యంతం అయ్యారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ స్కూల్లో బుధవారం(ఏప్రిల్ 08) ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ రాహుల్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ క్రమంలో రోజు విద్యార్థులకు భోజన విషయంలో మెనూ పాటించడం లేదని, విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, విధుల్లో నిర్లక్ష్యం వహించాడని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇంచార్జ్ హెచ్ఎం నెహ్రూను ఐటీడీఏ పీవో రాహుల్ సస్పెండ్ చేశారు.
విషయం తెలుసుకున్న విద్యార్థులు సార్ ఎటువంటి తప్పు చేయలేదు.. సార్‌పై ఓ మేడం తప్పుడు కంప్లైంట్ ఇవ్వడంతో ఆయనను సస్పెండ్ చేశారని విద్యార్థులు ఆందోళనకు దిగారు. సార్ చాలా మంచివాడని విద్యార్థులంతా హాస్టల్ ప్రాంగణంలో బైటాయించి నిరసన తెలిపారు. మా సార్ మాకే కావాలంటూ బోరున విలపించారు. సార్ పై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఐటీడీఏ అధికారులు ఆశ్రమ వద్దకు చేరుకుని విద్యార్థులతో మాట్లాడి సర్ది చెప్పారు. మేము విచారణ చేస్తాము, ఆ తర్వాత అధికారులకు నివేదిక సమర్పిస్తామని తెలియజేయడంతో ఆందోళన విరమించారు.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
