AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhurandhar 2 Movie: ‘ధురంధర్ 2’ సినిమా కోసం ఏకంగా 500 లీటర్ల పెట్రోల్.. వెలుగులోకి ఆసక్తికర విషయం

ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్ వీర్ సింగ్ హీరోగా నటించిన సినిమా ధురంధర్ ది రివేంజ్ (ధురంధర్ 2). మార్చి 19న విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కాగా ఈ బ్లాక్ బస్టర్ మూవీ గురించి తాజాగా ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

Dhurandhar 2 Movie: 'ధురంధర్ 2' సినిమా కోసం ఏకంగా 500 లీటర్ల పెట్రోల్.. వెలుగులోకి ఆసక్తికర విషయం
Dhurandhar 2 Movie
Basha Shek
|

Updated on: Apr 30, 2026 | 8:30 AM

Share

రణ్‌వీర్ సింగ్‌ హీరోగా వచ్చిన లేటేస్ట్ సినిమా ధరంధర్‌-2. మార్చి 19న వచ్చిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. ఏకంగా 1900 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల్లో టాప్-3లో నిలిచింది. ఇక ధురంధర్ సిరీస్ సినిమాలు రెండు కలిపి రూ.3 వేల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాయి. ఈ సినిమాలో రణ్ వీర్ సింగ్ సరసన సారా అర్జున్ హీరోయిన్ గా నటించింది. అక్షయ్ ఖన్నా, మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కాగా ధురంధర్ 2 మూవీ లో హైలెట్ అంటే క్లైమాక్స్ సీన్స్ అని చెప్పవచ్చు. బాంబు పేలుళ్లు, తుపాకీ కాల్పుల మోతతో సాగే ఈ సీన్స్ ఆడియెన్స్ కు గూస్ బంప్స్ తెప్పించాయి. అయితే భారీ క్లైమాక్స్‌ సీక్వెన్స్‌ కోసం ఎలాంటి గ్రాఫిక్స్ వాడలేదని స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ సూపర్‌వైజర్‌ విశాల్‌ త్యాగి వెల్లడించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన ధురంధర్ 2 సినిమా క్లైమాక్స్ సీన్స్ గురించి పలు ఆసక్తకర విషయాలు బయటపెట్టారు.

‘ ఫైర్‌తో కూడిన సన్నివేశాల కోసం గ్రాఫిక్స్‌ వద్దని ఆదిత్య ధర్ మాకు ముందుగానే చెప్పాడు. ఆయన చెప్పినట్లుగానే ఆ సీన్స్‌ అన్నీ రియల్‌గానే చేశాం. చివర్లో వచ్చే బ్లాస్ట్‌ను రూపొందించడం చాలా కష్టంగా చేశాం. ముఖ్యంగా రణ్‌వీర్‌ భద్రత విషయంలో చాలా ఆందోళన చెందాం. ఆయనకు ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా చూసుకున్నాం. మొదట 250 లీటర్ల పెట్రోల్ వాడాలని ప్రొడక్షన్‌ టీమ్‌ చెప్పింది. కానీ 500 లీటర్లు ఉంటేనే అవుట్‌ పుట్‌ బాగా వస్తుందని చెప్పాం. దీంతో పాటు 25 కేజీల పేలుడు పదార్థాలు వాడాం. షూటింగ్‌ పూర్తయ్యాక.. అద్భుతమంటూ నన్ను, టీమ్‌ని రణ్‌వీర్‌ అభినందించారు’ అని విశాల్ త్యాగి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ఈ బ్లాక్ బస్టర్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

1900 కోట్లను దాటిన ధురంధర్ 2 కలెక్షన్లు..

మే 14 నుంచి జియో హాట్ స్టార్ లో ధురంధర్ ది రివేంజ్!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు