AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్నికలు ముగిశాయి.. పెట్రోల్, డీజిల్ ధరలు నిజంగా పెరుగుతాయా? అసలు క్లారిటీ ఇదే!

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణలో పెట్రోల్ బంకుల వద్ద కనిపిస్తున్న దృశ్యాలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడబోతుందనే ఒక చిన్న పుకారు కార్చిచ్చులా వ్యాపించడంతో జనం బంకుల వైపు పరుగులు తీస్తున్నారు. ఆందోళన మనిషి విచక్షణను ఎలా దెబ్బతీస్తుందో ఈ క్యూలైన్లు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

ఎన్నికలు ముగిశాయి.. పెట్రోల్, డీజిల్ ధరలు నిజంగా పెరుగుతాయా? అసలు క్లారిటీ ఇదే!
Petrol Bunk
Balaraju Goud
|

Updated on: Apr 30, 2026 | 7:43 AM

Share

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణలో పెట్రోల్ బంకుల వద్ద కనిపిస్తున్న దృశ్యాలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడబోతుందనే ఒక చిన్న పుకారు కార్చిచ్చులా వ్యాపించడంతో జనం బంకుల వైపు పరుగులు తీస్తున్నారు. ఆందోళన మనిషి విచక్షణను ఎలా దెబ్బతీస్తుందో ఈ క్యూలైన్లు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు ఇంధన సరఫరాపై ప్రభావం చూపుతాయన్న వార్తలను జనం తమకు తోచినట్లుగా అర్థం చేసుకున్నారు. దీనికి తోడు సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు సమాచారం తోడవ్వడంతో, రేట్లు పెరుగుతాయేమో లేదా స్టాక్ అయిపోతుందేమో అన్న భయంతో లీటరు పట్టించుకోవాల్సిన చోట ట్యాంకులు ఫుల్ చేయించుకుంటున్నారు. వైజాగ్ నుంచి వరంగల్ వరకు ప్రతిచోటా ఇదే పరిస్థితి.

పరిస్థితి తీవ్రతను గమనించిన తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్రజలు పానిక్ కావాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. సరఫరాను పర్యవేక్షించడానికి ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అటు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు వేసి, కృత్రిమ కొరత సృష్టించకుండా చర్యలు చేపట్టారు.

మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం ఆయిల్ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. తెలంగాణలో ఎక్కడా షార్టేజ్ లేదని, రేట్లు పెరుగుతాయన్న ప్రచారంలో వాస్తవం లేదని తేల్చి చెప్పారు. కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వాలు పదేపదే చెబుతున్న మాట ఒక్కటే.. “ఆయిల్ ఉంది.. ఆందోళన వద్దు”. అవసరానికి మించి ఇంధనాన్ని నిల్వ చేసుకోవడం వల్ల నిజంగా అవసరమున్న వారికి ఇబ్బంది కలగడమే కాకుండా, అనవసరపు రద్దీకి కారణమవుతుంది. విజ్ఞప్తిని మన్నించి, వదంతులను పక్కన పెట్టి సాధారణ స్థితికి సహకరించాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రజలపైనే ఉంది.

ఇదిలావుంటే, హోర్ముజ్ జలసంధిలో నెలకొన్న అనిశ్చిత, సున్నితమైన పరిస్థితి కారణంగా రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందన్న వార్తలు వ్యాపించాయి. అయితే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రస్తుతానికి ఇంధన ధరలను పెంచే ప్రణాళికలు లేవని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈరోజు, ఏప్రిల్ 30న దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. అయితే, మే 1 నుండి పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాల ధరలు పెరగవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
4 సిక్సర్లు, 7 ఫోర్లతో ఉఫ్ అని ఊదేశాడుగా..
4 సిక్సర్లు, 7 ఫోర్లతో ఉఫ్ అని ఊదేశాడుగా..
బాలయ్య, చిరంజీవి మధ్య ఉన్న ఈ చిన్నారి.. ఇప్పుడు ఇండస్ట్రీలో తోపు
బాలయ్య, చిరంజీవి మధ్య ఉన్న ఈ చిన్నారి.. ఇప్పుడు ఇండస్ట్రీలో తోపు
నేటి నుంచి టెన్త్ సప్లిమెంటరీ 2026 ఫీజు చెల్లింపులు.. టైం టేబుల్
నేటి నుంచి టెన్త్ సప్లిమెంటరీ 2026 ఫీజు చెల్లింపులు.. టైం టేబుల్
ఓటీటీలోకి మరో అద్దిరిపోయే రియల్ స్టోరీ..ఐఎండీబీలో ఏకంగా 9 రేటింగ్
ఓటీటీలోకి మరో అద్దిరిపోయే రియల్ స్టోరీ..ఐఎండీబీలో ఏకంగా 9 రేటింగ్
వదంతుల సెగ.. బంకుల వద్ద భారీ క్యూలు..!
వదంతుల సెగ.. బంకుల వద్ద భారీ క్యూలు..!
వివాహం అయ్యాక కూడా “నా భర్త వేంకటేశ్వరుడే” అని ధైర్యంగా ప్రకటించి
వివాహం అయ్యాక కూడా “నా భర్త వేంకటేశ్వరుడే” అని ధైర్యంగా ప్రకటించి
ఇరాన్, ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై కీలక ముందడుగు!
ఇరాన్, ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై కీలక ముందడుగు!
Gold rate : మహిళలకు అదిరిపోయే న్యూస్.. తగ్గిన బంగారం ధరలు
Gold rate : మహిళలకు అదిరిపోయే న్యూస్.. తగ్గిన బంగారం ధరలు
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇక ఆఫీస్‌ల చుట్టూ తిరిగే పనిలేదు
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇక ఆఫీస్‌ల చుట్టూ తిరిగే పనిలేదు
శ్రీవారి సన్నిధిలో పెళ్లిపీటలెక్కిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్
శ్రీవారి సన్నిధిలో పెళ్లిపీటలెక్కిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్