TG Inter Results 2026: ఈసారి ఇంటర్ ఫలితాలు ఉద్దేశ్య పూర్వకంగానే ఆలస్యం..? విద్యాశాఖ సమాధానం ఇదే..
ఇంటర్ ఫలితాల 2026 ఆలస్యంపై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలను ఇంటర్ బోర్డు తోసిపుచ్చింది. ఉద్దేశపూర్వకంగానే ఇంటర్ ఫలితాలను ఆలస్యం చేస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో జోరుగా జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని తేలిపింది. ఇంటర్ ఫలితాల ప్రకటన నిర్ణీత..

హైదరాబాద్, ఏప్రిల్ 9: తెలంగాణ ఇంటర్ ఫలితాల 2026 ఆలస్యంపై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలను ఇంటర్ బోర్డు తోసిపుచ్చింది. ఉద్దేశపూర్వకంగానే ఇంటర్ ఫలితాలను ఆలస్యం చేస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో జోరుగా జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని తేలిపింది. ఇంటర్ ఫలితాల ప్రకటన నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని, ఎలాంటా జాప్యం ఉండబోదని విద్యాశాఖ స్పష్టంచేసింది. గతంలో కూడా ఎప్పుడూ ఇంటర్ ఫలితాలు ఏప్రిల్ మొదటి వారంలో విడుదల కాలేదన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఈ క్రమంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన్పటి నుంచి నుంచి గతేడాది వరకు జరిగిన ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల తేదీలను ఎక్స్ ఖాతాలో వెల్లడించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్ విభాగం ‘ఎక్స్’లో సదరు వివరాలను పోస్టు చేసింది.
తెలంగాణ ఇంటర్ ఫలితాలు తొలిసారి 2014లో మే 3వ తేదీన విడుదలయ్యాయి. ఆ తర్వాత 2015లో ఏప్రిల్ 22న, 2016లో ఏప్రిల్ 22న, 2017లో ఏప్రిల్ 16న, 2018లో ఏప్రిల్ 13న, 2019లో ఏప్రిల్ 18న, 2020లో జూన్ 18న (కొవిడ్ కారణంగా అందరినీ పాస్ చేశారు), 2021లో జూన్ 28న (కొవిడ్ కారణంగా అందరినీ పాస్ చేశారు), 2022లో జూన్ 28న, 2023లో మే 9న, 2024లో ఏప్రిల్ 24న, 2025లో ఏప్రిల్ 22న ఫలితాలు ప్రకటించినట్లు పేర్కొంది.
అధికారిక వివరణ
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల విడుదలను ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తున్నారంటూ, సామాజిక మాధ్యమాలలో కొన్ని తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయి. కానీ, ఇందులో ఎటువంటి వాస్తవము లేదు. ఇంటర్మీడియట్ ఫలితాల ప్రకటన నిర్ణీత షెడ్యూల్ ప్రకారం జరుగుతుందని, తెలంగాణ ప్రభుత్వ… pic.twitter.com/hzqsO28Sg1
— FactCheck_Telangana (@FactCheck_TG) April 9, 2026
ఈ ఏడాది ఇంటర్ ఫలితాలు 2026 ఎప్పుడు విడుదల చేస్తారంటే?
ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ సమాధాన పత్రాల మూల్యాంకనం, ఇతర అంశాల ఆధారంగా ఫలితాలను ప్రకటించే తేదీలు యేటా మారుతూ ఉంటాయని తెలంగాణ విద్యాశాఖ పేర్కొంది. మూల్యాంకనం పూర్తయ్యే సమయం ఆధారంగానే ఫలితాలను విడుదల చేస్తారని తెలిపింది. విద్యా శాఖ ఇచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే విద్యార్థులు, తల్లిదండ్రులు విశ్వసించాలని, సోషల్ మీడియాలో ప్రచారమయ్యే తప్పుడు వార్తలను నమ్మవద్దని ఈ సందర్భంగా కోరింది. కాగా తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఏప్రిల్ మూడో వారంలో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే బోర్డు పలుమార్లు స్పష్టం చేసింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




