AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఓటీటీలోకి మరో అద్దిరిపోయే రియల్ స్టోరీ.. ఐఎండీబీలో ఏకంగా 9/10 రేటింగ్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

కొన్ని రోజుల క్రితమే విడుదలైన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ ఇందులో ప్రధాన పాత్ర పోషించడం విశేషం. గ్రామీణ నేపథ్యంలో సాగే రివేంజ్ థ్రిల్లర్ గా ఈ మూవీని తెరకెక్కించాడు దర్శకుడు.

OTT Movie: ఓటీటీలోకి మరో అద్దిరిపోయే రియల్ స్టోరీ.. ఐఎండీబీలో ఏకంగా 9/10 రేటింగ్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
OTT Movie
Basha Shek
|

Updated on: Apr 30, 2026 | 7:30 AM

Share

ఇటీవల నిజ జీవిత సంఘటనల ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. వీటికి ఆడియెన్స్ నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక రియల్ స్టోరీనే. విలేజ్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ మూవీలో, స్థానిక ఎమ్మెల్యేను ప్రశ్నించిన ఒక సాధారణ వ్యక్తి ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడన్నదే ఈ సినిమా కథ. కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తమిళ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంది. ఈ పవర్ మిస్యూస్, గ్రామీణ సమస్యలు, మహిళలపై జరుగుతున్న దౌర్జన్యాలు వంటి సెన్సిటివ్ అంశాలను ఈ సినిమాలో చూపించారు. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టిన ఈ సినిమాకు IMDBలోనూ 9 రేటింగ్ ఉండటం విశేషం. అప్పు తీసుకుని తిరిగి చెల్లించలేని మహిళలపై ఒక వడ్డీ వ్యాపారీ ఇన్బరాజ్ లైంగిక వేధింపులకు పాల్పడు తుంటాడు. ఈ క్రమంలోనే హీరో, హీరో భార్య కూడా సమస్యల్లో చిక్కుకుంటారు. చివరికి గ్రామంలో జరుగుతున్న అన్యాయాలకు ముగింపు పలకాలని హీరో నిర్ణయించుకుంటాడు. ఇదే క్రమంలో ఊర్లో సమస్యల పై స్థానిక ఎమ్మెల్యేను నిలదీస్తాడు. ఆ క్రమంలో ఇన్బరాజ్ పరువు పోతుంది. దీంతో హీరోపై ఎమ్మెల్యే పగ పెంచుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? హీరో కుటుంబం ఎలాంటి సమస్యల్లో చిక్కుకుంది? చివరకు ఏమైంది? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

సెల్వరాఘవన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాపేరు ‘మణిదన్ దైవమంగళం’. . డెనిస్ మంజునాథ్ తెరకెక్కించిన ఈ విలేజ్ రస్టిక్ డ్రామలో కన్నడ నటి ఖుషీ రవి హీరోయిన్ గా చేసింది. అలాగే మైమ్ గోపీ, వైజీ మహేంద్రన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. మే 01 నుంచి సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతానికి తమిళంలోనే స్ట్రీమింగ్ అవుతుందని మాత్రమే చెప్పారు. అయితే సెల్వరాఘవన్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా తెలుగులోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది.

ఇవి కూడా చదవండి

సన్ నెక్ట్స్ లో సెల్వరాఘవన్ సినిమా.. మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us