వైరస్‌ని గుర్తించేందుకు శాంపిల్‌గా పుక్కిలించిన నీరు: ఐసీఎంఆర్
కరోనా వైరస్‌ని గుర్తించేందుకు పుక్కిలించిన నీరు కూడా శాంపిల్‌గా ఉపయోగపడొచ్చని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) తెలిపింది.
Covid 19 swab collection: కరోనా వైరస్‌ని గుర్తించేందుకు పుక్కిలించిన నీరు కూడా శాంపిల్‌గా ఉపయోగపడొచ్చని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. దీని వలన హెల్త్ కేర్ వర్కర్ల కోసం ప్రత్యేక శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉండకపోవచ్చునని ఐసీఎంఆర్ అభిప్రాయపడింది. అంతేకాకుండా శాంపిల్స్‌ని తీసుకునేందుకు ప్రత్యేక కిట్‌ని ధరించాల్సిన అవసరం ఉండకపోవచ్చునని తెలిపింది. దీనిపై అధ్యయనం చేసిన ఓ బృందం ఈ మేరకు ఓ జర్నల్‌లో పలు విషయాలను వెల్లడించింది. కరోనా వైరస్‌ని గుర్తించేందుకు పుక్కిలించిన నీరు కూడా ఉపయోగపడొచ్చని వారు తెలిపారు. ఈ అధ్యయనంలో డా.నవీనీత్ విగ్, డా.మనీష్ సొనేజా, డా. నీరజ్ నిశ్చల్, డా. అంకిత్ మిట్టల్, డా. అంజన్ త్రిఖా, డా.కపిల్ దేవి తదితరులు పాలు పంచుకొన్నారు.
”కరోనా కోసం ప్రస్తుతం శాంపిల్స్ తీసుకునే విధానంలో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అంతేకాకుండా ఇందుకోసం ప్రత్యేక శిక్షణ అవసరం. ఇందుకోసం ప్రత్యామ్నాయంగా శాంపిల్స్ సేకరించే విషయంపై అధ్యయనం చేశాము. అందులో పుక్కిలించిన నీటి నుంచి వైరస్‌ని కనుగొనే ప్రక్రియ ఒకటి. ప్రస్తుతానికి ఇది కొత్తదేం కానప్పటికీ, దీని గురించి తమ వద్ద తక్కువ సమాచారం ఉందని” వారు వెల్లడించారు. మే-జూన్ మధ్య కాలంలో కరోనా బారిన పడిన 50 మంది శాంపిల్స్‌ని తీసుకొని ఈ అధ్యయనం చేసినట్లు వారు తెలిపారు.
Read More: