06 January 2025

పెళ్లికి రెడీ అవుతున్నారా.. ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

TV9 Telugu

పెళ్లీల సీజన్ మొదలైపోయింది. ముఖ్యంగా ఫిబ్రవరీలో చాలా వరకు మంచి ముహుర్తాలు ఉండటంతో అమ్మాయిలు, అబ్బాయిలు పెళ్లికి రెడీ అయిపోతున్నారు.

ఇక పెళ్లి అంటే చాలు అమ్మాయిలు చాలా భయపడి పోతుంటారు. కానీ కొంత మంది మాత్రం కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నందుకు ఆనంద పడిపోతారు.

 కొంత మంది మాత్రం ఏమీ ఆలోచించకుండా కుటుంబం కోసమో లేదా, తనకు నచ్చిన అబ్బాయిని లేదా అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకుంటారు.

 అయితే పెళ్లి చేసుకునే ముందు అమ్మాయి, అబ్బాయి తప్పకుండా కొన్ని విషయాలను తెలుసుకోవాలంట. అవి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.

పెళ్లికి సరైన ఏజ్ ఉందా? అమ్మాయి లేదా అబ్బాయి ఇద్దరు ఇష్టపూర్వకంగా పెళ్లికి ఒప్పుకున్నారా లేదా తెలుసుకోవాలంట.

పెళ్లి చేసుకోబో వారు ఒకరితో ఒకరు కాసేపు మాట్లాడుకోవాలంట. దీని వలన ఇద్దరి గురించి ఒకరికి ఒకరు అర్థం అవుతారు. మంచి, చెడు ఈజీగా తెలుస్తుంది.

అలాగే అబ్బాయికి ముందు ఏమైనా పర్సనల్ అప్పులు ఉన్నాయా? తన అమ్మానాన్నల దగ్గర ఏవిషయమైనా దాస్తున్నాడా అనేది క్లారిటీగా తెలుసుకోవాలంట.

అదే విధంగా మీరు మీ భాగస్వామి ప్రేమ, అతని బలహీనతలు, స్వేచ్ఛ , నిజాయితీ లాంటి ప్రతీ విషయం గురించి పంచుకోవాలంట.