High BP: అధిక బీపీతో ఎప్పుడైనా ప్రమాదమే.. ఆహారంలో ఈ జాగ్రత్తలు తీసుకోపోతే కష్టమే..
High BP: హైపర్‌టెన్షన్ లేదా అధిక రక్తపోటు అనేది సైలెంట్ కిల్లర్. దీర్ఘకాలిక గుండె జబ్బుల ప్రమాదానికి దారి తీస్తుంది. ఇది లక్షణాలు కనిపించకుండానే

High BP: హైపర్‌టెన్షన్ లేదా అధిక రక్తపోటు అనేది సైలెంట్ కిల్లర్. దీర్ఘకాలిక గుండె జబ్బుల ప్రమాదానికి దారి తీస్తుంది. ఇది లక్షణాలు కనిపించకుండానే అభివృద్ధి చెందుతుంది. ధమనుల సంకుచితం, ఒత్తిడి, ఆహార ఎంపికల కారణంగా రక్త ప్రసరణ బాగా పెరిగితే అధిక రక్తపోటు అంటారు. సాధారణంగా రక్తపోటును కింది విధంగా వర్గీకరించవచ్చు.
1. సాధారణ రక్తపోటు: 120/80 mm Hg 2. పెరిగిన రక్తపోటు: 120/129 mm Hg 3. పెరిగిన మొదటి దశ: 130/139 mm Hg 4.పెరిగిన రెండో దశ : 140/90 mm Hg 5. తీవ్రమైన రక్తపోటు: 180/120 mm Hg అంతకు మించి
బీపీని కంట్రోల్ చేయాలంటే ఉప్పు, కొవ్వు కలిగిన ఆహారం, తక్కువ చక్కెర ఉన్న డైట్ మెయింటెన్ చేయాలి. ఎక్కువగా తాజా పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లు, బీన్స్, కూరగాయలు, గింజలు తీసుకోవాలి. చక్కెర చాలా పరిమితంగా ఉండాలి. ప్రతిరోజు భోజనంలో మిరియాలు, పుట్టగొడుగులు, బచ్చలికూర, ఆలివ్ నూనెతో వండిన ఆమ్లెట్ తినాలి. ఈ ఆహరాలు అధిక బీపీని కంట్రోల్ చేయడానికి సహయపడుతాయి. లంచ్ కోసం, ట్యూనా, బీన్స్, టోఫు, చికెన్, తీసుకోవచ్చు. అదనంగా తాజా ఆకుకూరలు, నిమ్మకాయతో చేసిన సలాడ్స్ చేర్చుకోవచ్చు.
ఆరోగ్యకరమైన కొవ్వుల కోసం ఆహారంలో ఆలివ్ ఆయిల్, అవకాడోస్, గింజలు, విత్తనాలను చేర్చవచ్చు. ఆలివ్ ఆయిల్‌తో వంటలు తయారు చేయాలి. గింజలను చిరుతిండిగా తినాలి. అల్పాహారం కోసం నువ్వులు, నిమ్మరసంతో అవోకాడో టోస్ట్ చేసుకోవచ్చు. గుడ్లు, చికెన్, చేపలు తప్పనిసరిగా భోజనంలో ఉండాలి. అయితే అధిక మొత్తంలో కాకుండా కొద్దిగా ఉంటే సరిపోతుంది. అప్పుడప్పుడు చేపలు, చికెన్ సూప్‌లు కూడా తీసుకోవచ్చు.