Health Tips: ఖాళీ కడుపుతో వీటిని తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.. ఏం తినాలో ఇక్కడ తెలుసుకోండి..
Health Tips: శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. రోజు ప్రారంభంలో తినే అల్పాహారం ముఖ్యమైన ఆరోగ్యంగా ఉండటంతో కీలక పాత్ర
Health Tips: శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. రోజు ప్రారంభంలో తినే అల్పాహారం ముఖ్యమైన ఆరోగ్యంగా ఉండటంతో కీలక పాత్ర పోషిస్తుంది. నిజానికి, అల్పాహారంగా మంచి ఫుడ్ తీసుకుంటే రోజంతా శరీరంలో శక్తి ఉంటుంది. కాబట్టి ఉదయం అల్పాహారాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి. బిజీ షెడ్యూల్ కారణంగా చాలా మంది అల్పాహారం ఆలస్యంగా తీసుకోవడం, టిఫిన్ చేయకపోవడం చేస్తుంటారు. కానీ, ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే, ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొన్ని రకాల ఆహార పదార్థాలు తింటే సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి ఏం తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..
దాల్చిన చెక్క.. దాల్చిన చెక్క ఆరోగ్యానికి చాలా రకాలుగా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీన్ని మార్నింగ్ డైట్‌లో భాగంగా చేసుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తేనె, దాల్చిన చెక్కక, నీరు త్రాగితే ఆరోగ్యంగా ఉంటారు. దీని ద్వారా బరువు కూడా తగ్గించుకోవచ్చు.
బొప్పాయి.. బొప్పాయి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. బొప్పాయిలో ఫైబర్, ఫోలేట్, విటమిన్లు మొదలైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది మీ కాలయాన్ని నిర్విషీకరణ చేస్తుంది. గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతే కాకుండా మధుమేహంతో బాధపడేవారిలో బ్లడ్ షుగర్‌ను నియంత్రిస్తుంది.
నిమ్మరసం.. నిమ్మ రసం బరువు తగ్గడంలో అద్భుతంగా సహాయపడుతుంది. దాంతోపాటు ఇతర అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో సగం నిమ్మకాయ, కొద్దిగా తేనె కలపి తాగాలి. దీని ద్వారా జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. నిమ్మరసం శరీరంలోని బ్యాక్టీరియాను, విష పదార్థాలను బయటకు పంపుతుంది.
బాదం.. బాదం కండరాలను నిర్మించడంలో సహాయపడుతుంది. ఇందులో ప్రోటీన్ కూడా పుష్కలంగా ఉంటుంది. రాత్రిపూట నానబెట్టిన బాదం పప్పును ఉదయాన్నే తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మిల్క్ షేక్, ఇతర జ్యూస్‌లలో కూడా బాదం పప్పును మిక్స్ చేసుకుని తీసుకోవచ్చు.
ఎండుద్రాక్ష నీరు.. ఆరోగ్య సంరక్షణలో ఎండుద్రాక్ష పాత్ర కీలకం అని చెప్పాలి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎండుద్రాక్షను తినడమే కాకుండా.. వాటిని నానబెట్టిన తరువాత ఉన్న నీటిని తాగడం ద్వారా కూడా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. రక్త హీనత ఇతర సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
Also read: