Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTD Smart Card: టీటీడీ ఉద్యోగులకు స్మార్ట్ కార్డులు.. ఈ కార్డుతో ప్రయోజనాలేంటో తెలుసా?..

TTD Smart Card: తిరుమల తిరుపతి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు సంబంధించి టీటీడీ బోర్డు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

TTD Smart Card: టీటీడీ ఉద్యోగులకు స్మార్ట్ కార్డులు.. ఈ కార్డుతో ప్రయోజనాలేంటో తెలుసా?..
Tirumala
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 20, 2021 | 9:25 AM

TTD Smart Card: తిరుమల తిరుపతి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు సంబంధించి టీటీడీ బోర్డు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ ఉద్యోగులకు స్మార్ట్ కార్డులు జారీ చేశారు. టీటీడీ ఉద్యోగుల సంక్షేమ చర్యల్లో భాగంగానే అందరికీ స్మార్ట్ కార్డులు జారీ చేయడం జరిగిందని బోర్డు అధికారులు తెలిపారు. టీటీడీ ఈవో కెఎస్. జవహర్ రెడ్డి ఆదేశాల మేరకు జెఈఓ సదా భార్గవి పర్యవేక్షణలో ఈ స్మార్ట్ కార్డుల జారీ పూర్తయ్యింది. మొత్తం 6,597 మంది ఉద్యోగులకు ఆర్ఎఫ్ఐడి(రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్) సాంకేతికతో కూడిన స్మార్ట్ కార్డులతో పాటు ఫ్యామిలీ కార్డును అందించడం జరిగింది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ పరిజ్ఞానం ద్వారా ఉద్యోగుల సమగ్ర సమాచారాన్ని ఈ స్మార్ట్ కార్డులో పొందుపరచడం జరిగింది. పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లకు కూడా స్మార్ట్ కార్డు అందజేయడం జరిగింది. టీటీడీ కార్యాలయాల్లోకి ప్రవేశానికి, టీటీడీ ఆలయాల్లో దర్శనానికి, ప్రతినెలా లడ్డూలు పొందేందుకు, క్యాలెండర్, పంచాంగం పొందేందుకు, వైద్య వసతులు తదితర సౌకర్యాలు ఈ కార్డు ఉపకరిస్తుందని బోర్డు అధికారులు తెలిపారు.

Also read:

Good Governance Week: నేడు దేశవ్యాప్తంగా సుపరిపాలన వారోత్సవాల కార్యక్రమాన్ని ప్రారంభించనున్న కేంద్రం..

Income Tax Password: ఆదాయపు పన్ను పోర్టల్‌లో పాస్‌వర్డ్‌ మర్చిపోయారా..? ఇలా చేయండి

Bigg Boss 5 Telugu Winner: సిరి, షణ్ముఖ్ రిలేషన్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన సన్నీ.. ఏమన్నాడంటే..