Health Tips : తెల్ల రక్త కణాల పెరుగుదలకు ఈ జ్యూస్ తప్పనిసరి..! కచ్చితంగా డైట్‌లో చేర్చుకోండి..

Health Tips : శరీరంలో తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచడం ద్వారా ఏ రకమైన ఇన్ఫెక్షన్ అయినా నివారించవచ్చు. ఇందుకోసం ప్రతిరోజు ఉసిరి, అల్లంతో చేసిన జ్యూ్స్ తాగాలి.

Health Tips : తెల్ల రక్త కణాల పెరుగుదలకు ఈ జ్యూస్ తప్పనిసరి..! కచ్చితంగా డైట్‌లో చేర్చుకోండి..
Amla Ginger Juice
Follow us
uppula Raju

|

Updated on: Aug 06, 2021 | 6:45 PM

Health Tips : శరీరంలో తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచడం ద్వారా ఏ రకమైన ఇన్ఫెక్షన్ అయినా నివారించవచ్చు. ఇందుకోసం ప్రతిరోజు ఉసిరి, అల్లంతో చేసిన జ్యూ్స్ తాగాలి. ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఉసిరిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ సి ఉంటుంది. ఇది మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఉసిరిలో ఉండే బీటా కెరోటిన్ ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలతో పోరాడతాయి. ఆమ్లా డయాబెటిస్‌ను నియంత్రించడంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

అల్లం ప్రయోజనాలు – అల్లంలో జింజెరోల్ ఉంటుంది. ఇది దగ్గు, గొంతు నొప్పి, ఇతర వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్, జింగరోన్ కూడా ఉంటుంది. ఇది మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది కాకుండా అల్లం కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

కొత్తిమీర ఆకుల ఆరోగ్య ప్రయోజనాలు – ఆకుపచ్చ కూరగాయలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, ఫైబర్ ఉంటాయి. ఇది డిటాక్సిఫైయింగ్, యాంటీ బాక్టీరియల్, రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలను కలిగి ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఈ లక్షణాలన్నీ కొత్తిమీరను గొప్ప ఆహారంగా చేస్తాయి.

పుదీనా ఆకుల ఆరోగ్య ప్రయోజనాలు – పుదీనా వాపు, ఇన్ఫెక్షన్‌తో పోరాడటానికి ఉపయోగపడుతుంది. అనేక అధ్యయనాల ప్రకారం.. పుదీనా యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల గొప్ప మూలం. ఇది గొంతు నొప్పి, దగ్గు నుంచి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది. అలాగే దాని తాజా సువాసన తలనొప్పిని దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది.

జ్యూస్ తయారీ చేసే విధానం..

1. ఉసిరి – 5-6 తరిగినవి అల్లం రసం – 1 స్పూన్ కొత్తిమీర లేదా పుదీనా ఆకులు – 3-4 సరిపడ నల్ల ఉప్పు తేనె – 1 స్పూన్

అన్ని పదార్థాలను గోరువెచ్చని నీటితో కలపాలి. జామకాయను కోసి జ్యూస్‌లో వేయాలి. అన్ని పదార్థాలను వేసి బాగా కలపాలి. చాట్ మసాలా కూడా జోడించవచ్చు. ఒక గ్లాసులో వడకట్టి తాగాలి. అయితే ఇది ప్రయత్నించే ముందు ఒక్కసారి వైద్యుడి సలహా తీసుకోవడం మరిచిపోకండి..

Flaxseed Oil : అవిసె గింజల నూనెతో చర్మ సమస్యలకు చెక్..! దీని కింద ఏ బ్యూటీ ప్రొడక్ట్స్‌ పనికిరావు..

Most Effective Exercise: వ్యాయామానికి సమయం దొరకడం లేదా..? రోజూ ఇలా రెండు నిమిషాలు చేస్తే చాలు..!!

Relationship Tips: బ్రేకప్ బాధ నుంచి బయటపడాలంటే.? ఈ నాలుగు విషయాలు తప్పనిసరిగా గుర్తుంచుకోండి!