అలర్ట్.. మొలకెత్తిన బంగాళాదుంపలు తింటున్నారా..? శరీరంలో ఏం జరుగుతుందో తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలను తినడం వల్ల చర్మంపై చికాకు, కంటి చికాకు వంటి అలెర్జీలు కూడా వస్తాయి. పిల్లలు, వృద్ధులలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి వీరు మొలకలు వచ్చిన బంగాళాదుంపలను తినకూడదు. అలాగే, బంగాళాదుంప తినడానికి చేదుగా ఉంటే, అది తినకూడదని అర్థం. వాటిని పడేయడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ఒక్కోసారి ఇంట్లో నిల్వవుంచిన బంగాళదుంపలు మొలకెత్తుతుంటాయి. అలా మొలకలు వచ్చిన బంగాళాదుంపలను కూడా వంటకు ఉపయోగిస్తుంటారు చాలా మంది. కానీ, ఇలా మొలకెత్తిన బంగాళాదుంపలను తినడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని తినటం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు నిపుణులు. మొలకెత్తిన బంగాళదుంపలు తినటం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇక్కడ తెలుసుకుందాం..
మొలకెత్తిన లేదంటే ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలను వంటకు వాడకుండా ఉండటమే మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. మొలకెత్తిన బంగాళాదుంపలలో పోషక విలువలు తగ్గిపోతాయని అంటున్నారు. అంతేకాదు..బంగాళదుంపలు మొలకెత్తినప్పుడు అందులో గ్లైకోఅల్కలాయిడ్స్ అనే కొన్ని విషపూరిత సమ్మేళనాలు యారవుతాయట. ఇవి ఫుడ్ పాయిజన్ కలిగిస్తాయని చెబుతున్నారు. అలాగే.. మొలకెత్తిన బంగాళాదుంపల్లో సోలనిన్ అనే విష రసాయనం ఉత్పత్తి అవుతుంది. ఇది శరీరానికి ప్రమాదకరమైనది.
మొలకెత్తిన బంగాళాదుంపలు తినడం వల్ల కడుపు నొప్పి, వాంతులు, ఒక్కోసారి విరేచనాలు వంటి జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరంలోని నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీంతో తలనొప్పి, మైకము వంటి సమస్యలు కూడా తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. మొలకెత్తిన బంగాళాదుంపలను తినడం వల్ల చర్మంపై చికాకు, కంటి చికాకు వంటి అలెర్జీలు కూడా వస్తాయి. పిల్లలు, వృద్ధులలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి వీరు మొలకలు వచ్చిన బంగాళాదుంపలను తినకూడదు. అలాగే, బంగాళాదుంప తినడానికి చేదుగా ఉంటే, అది తినకూడదని అర్థం. వాటిని పడేయడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








