AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాలు, పెరుగు కలిపి తింటే ఏమవుతుంది..? ఓర్నాయనో.. పెద్ద కథే ఉందిగా..

పాలు, పెరుగు రెండూ ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలే అయినప్పటికీ.. వాటిని ఒకేసారి కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాలు చల్లని స్వభావం కలిగినవి.. పెరుగు పులిసిన ఆహారం కావడంతో ఈ కలయిక కడుపులో గ్యాస్, అసిడిటీ, ఉబ్బరం వంటి సమస్యలకు దారితీయవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రివేళ ఈ కలయికను నివారించాలని సూచిస్తున్నారు.

పాలు, పెరుగు కలిపి తింటే ఏమవుతుంది..? ఓర్నాయనో.. పెద్ద కథే ఉందిగా..
Milk Curd
Shaik Madar Saheb
|

Updated on: May 23, 2026 | 7:01 PM

Share

పాలలో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. అందుకే.. పాలు సంపూర్ణ ఆహారంగా భావిస్తారు. కాల్షియం, ప్రోటీన్, విటమిన్లతో నిండిన పాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే, పాలు తాగిన వెంటనే కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తప్పు ఆహార కలయికలు జీర్ణ సమస్యలకు కారణమవుతాయని హెచ్చరిస్తున్నారు. ఆయుర్వేదం ప్రకారం.. పాలు చల్లని స్వభావం కలిగిన ఆహారం. దీనికి విరుద్ధ గుణాలు ఉన్న పదార్థాలను కలిపి తీసుకుంటే శరీరంలో జీర్ణక్రియ దెబ్బతింటుంది. ముఖ్యంగా పాలు తాగిన వెంటనే పుల్లటి పదార్థాలు తీసుకోవద్దని సూచిస్తున్నారు. నిమ్మకాయ, కమలాపండు, మోసంబి, ద్రాక్ష వంటి సిట్రస్ ఫలాలు పాలతో కలిసి కడుపులో రియాక్షన్‌కు దారితీసి అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం సమస్యలు కలిగించవచ్చు.

అలాగే చేపలు, మాంసాహార పదార్థాలు తీసుకున్న వెంటనే పాలు తాగడం కూడా మంచిది కాదని చెబుతున్నారు. ఈ కలయిక శరీరంలో టాక్సిన్లు పెరగడానికి కారణమవుతుందని ఆయుర్వేదం పేర్కొంటోంది. కొందరిలో చర్మ సమస్యలు, అలర్జీలు వచ్చే అవకాశం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పాలు, పెరుగు రెండూ పాల ఉత్పత్తులే అయినప్పటికీ..

పాలతో పాటు పెరుగు తీసుకోవడంపై కూడా చాలా మందికి సందేహాలు ఉంటాయి. పాలు, పెరుగు రెండూ పోషకాహారాలే అయినప్పటికీ.. ఒకేసారి కలిపి తీసుకుంటే కొందరిలో జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో పాలు, పెరుగు కలిపి తీసుకుంటే కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు రావచ్చని హెచ్చరిస్తున్నారు. అయితే, లస్సీ, మజ్జిగ వంటి కొన్ని సంప్రదాయ ఆహారాల్లో ఈ కలయికను ప్రత్యేక పద్ధతుల్లో ఉపయోగిస్తారని, అవి సాధారణంగా హానికరం కాదని పేర్కొంటున్నారు.

పాలు పులవనివి, పెరుగు పులిసినది. వీటిని కలిపి తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట వంటి సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి, పాలు లేదా పెరుగు ఏదో ఒకదానిని వేర్వేరు సమయాల్లో తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.

పాలతో పాటు ఉప్పు ఎక్కువగా ఉన్న పదార్థాలు కూడా వెంటనే తీసుకోకూడదని సూచిస్తున్నారు. ఇవి జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపవచ్చని పేర్కొంటున్నారు.

ఇంకా అరటి పండుతో పాలు తీసుకోవడం చాలా మంది అలవాటుగా చేసుకుంటారు. అయితే ఇది అందరికీ సరిపోదని, కొందరిలో జీర్ణ సమస్యలు, బరువు పెరగడం వంటి సమస్యలకు దారితీయవచ్చని చెబుతున్నారు.

పాలు తాగిన తర్వాత కనీసం 30 నిమిషాల నుంచి గంట గ్యాప్ ఇచ్చి ఇతర ఆహారాలు తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. సరైన ఆహార కలయికలు పాటిస్తేనే పాలలోని పూర్తి పోషకాలు శరీరానికి అందుతాయని చెబుతున్నారు.

ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఏమైనా సమస్యలున్నా.. సందేహాలున్నా నేరుగా ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పాలు, పెరుగు కలిపి తింటే ఏమవుతుంది..? ఓర్నాయనో.. పెద్ద కథే ఉందిగా
పాలు, పెరుగు కలిపి తింటే ఏమవుతుంది..? ఓర్నాయనో.. పెద్ద కథే ఉందిగా
మీ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ ఉందా? రూ.50 లక్షలు వస్తాయని తెలుసా?
మీ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ ఉందా? రూ.50 లక్షలు వస్తాయని తెలుసా?
పిల్లలు వద్దనుకోవడం నిజంగా పాపమా? అసలు నిజం ఏమిటి?
పిల్లలు వద్దనుకోవడం నిజంగా పాపమా? అసలు నిజం ఏమిటి?
10 ఏళ్ల నాటి సీన్ రిపీట్.. హైదరాబాద్‌దే ట్రోఫీ.. ఇదిగో సాక్ష్యం
10 ఏళ్ల నాటి సీన్ రిపీట్.. హైదరాబాద్‌దే ట్రోఫీ.. ఇదిగో సాక్ష్యం
రోజంతా ఫోన్ చేతిలోనే ఉంటుందా..? మీ శరీరం ఇచ్చే 4 డేంజర్ సిగ్నల్స్
రోజంతా ఫోన్ చేతిలోనే ఉంటుందా..? మీ శరీరం ఇచ్చే 4 డేంజర్ సిగ్నల్స్
సంపద వరదలా వచ్చే గజకేసరి యోగం.. ఈ లక్కీ రాశుల్లో మీరు ఉన్నారా..?
సంపద వరదలా వచ్చే గజకేసరి యోగం.. ఈ లక్కీ రాశుల్లో మీరు ఉన్నారా..?
గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. జూన్ 30లోగా ఇది చేయకపోతే..
గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. జూన్ 30లోగా ఇది చేయకపోతే..
నాగార్జున నా ముఖం మీద సిగరెట్ పొగ ఊది ఐలవ్యూ చెప్పాడు
నాగార్జున నా ముఖం మీద సిగరెట్ పొగ ఊది ఐలవ్యూ చెప్పాడు
తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఎస్బీఐ అప్రెంటీస్ ఖాళీలు.. స్టైపెండ్..
తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఎస్బీఐ అప్రెంటీస్ ఖాళీలు.. స్టైపెండ్..
హైదరాబాద్‌లో లాయర్ దారుణ హత్య.. కారు ఎక్కుతుండగా..
హైదరాబాద్‌లో లాయర్ దారుణ హత్య.. కారు ఎక్కుతుండగా..